Share News

తహసీల్దార్లకు మండలాల కేటాయింపు

ABN , Publish Date - Feb 02 , 2024 | 12:31 AM

సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో జోన్‌-4 పరిధిలోని అనంతపురం, వైఎస్సార్‌ కడప, కర్నూలు జిల్లాల నుంచి బదిలీపై చిత్తూరు జిల్లాకు వచ్చిన తహసీల్దార్లలో 31 మందికి మండలాలు కేటాయిస్తూ గురువారం కలెక్టర్‌ షన్మోహన్‌ ఉత్తర్వులు జారీచేశారు.

తహసీల్దార్లకు మండలాల కేటాయింపు

చిత్తూరు కలెక్టరేట్‌, ఫిబ్రవరి 1: సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో జోన్‌-4 పరిధిలోని అనంతపురం, వైఎస్సార్‌ కడప, కర్నూలు జిల్లాల నుంచి బదిలీపై చిత్తూరు జిల్లాకు వచ్చిన తహసీల్దార్లలో 31 మందికి మండలాలు కేటాయిస్తూ గురువారం కలెక్టర్‌ షన్మోహన్‌ ఉత్తర్వులు జారీచేశారు. వీరు వెంటనే వారికి కేటాయించిన మండలాల్లో బాధ్యతలు చేపట్టాలని ఆ ఉత్తర్వులో పేర్కొన్నారు. కాగా, ఈ ఏడాది జూన్‌ 30 నాటికి మూడేళ్ల పదవీకాలం పూర్తవ్వని, జూన్‌ 30 నాటికి పదవీ విరమణ చేయనున్న 10 మంది తహసీల్దార్లను ఎన్నికేతర విభాగాల్లో నియమిస్తూ ఉత్తర్వులు జారీచేశారు.

ఫ పెద్దపంజాణిలో పనిచేస్తున్న బి.లోకేశ్వరరావును గంగవరానికి, తిరుపతి జిల్లా బి.ఎన్‌.కండ్రిగలో పనిచేస్తున్న జి.శివయ్యను వెదురుకుప్పానికి బదిలీ చేశారు. చిత్తూరు కలెక్టరేట్‌లోని భూసేకరణ విభాగంలో పనిచేస్తున్న పి. వెంకటేశ్వరన్‌ను కలెక్టరేట్‌ ఏవోగా, పలమనేరు ఆర్డీవో కార్యాలయంలో ఏవోగా పనిచేస్తున్న ఎం. ప్రసాద్‌ బాబును కలెక్టరేట్‌ భూసేకరణ విభాగ ఏవోగా నియమించారు. పలమనేరులో పనిచేస్తున్న ఈజీ కుప్పస్వామిని పలమనేరు ఆర్డీవో కార్యాలయ ఏవోగా, పూతలపట్టులో పనిచేస్తున్న వై. విజయభాస్కర్‌ను చిత్తూరు ఆర్డీవో కార్యాలయ ఏవోగా, ఐరాలలో పనిచేస్తున్న పి.సుశీలను చిత్తూరు కలెక్టరేట్‌లోని కోఆర్డినేషన్‌ సెక్షన్‌కు సూపరింటెండెంట్‌గా, తవణంపల్లిలో పనిచేస్తున్న కె. గుణశేఖర్‌రెడ్డిని చిత్తూరు కలెక్టరేట్‌ మెజిస్టీరియల్‌ సెక్షన్‌ సూపరింటెండెంట్‌గా, విజయపురంలో పనిచేస్తున్న పి. వెంకట్రాయులును కలెక్టరేట్‌లోని భూసేకరణ విభాగ సూపరింటెండెంట్‌గా నియమించారు. ప్రస్తుతం సస్పెన్షన్‌లో కొనసాగుతున్న సోమల తహసీల్దార్‌ ఎస్‌. షబార్‌ బాషాను చిత్తూరు కలెక్టరేట్‌ కార్యాలయంలో కేఆర్‌ఆర్సీ తహసీల్దార్‌గా నియమిస్తూ ఆ ఉత్తర్వులో పేర్కొన్నారు.

మండలాల కేటాయింపుల వివరాలిలా వున్నాయి ....

ఫ ఉమ్మడి అనంతపురంజిల్లా నుంచి వచ్చిన తహసీల్దార్లు.. కె.విజయలక్ష్మి (గుడిపాల), ఎ.హరికుమార్‌ (కుప్పం), డి.వసంతలత (పులిచెర్ల), ఇ.నాగరాజు (సోమల), టి.నారాయణస్వామి (సదుం), డి.నీలకంఠారెడ్డి (చౌడేపల్లె), వై.రంగనాయకులు (పలమనేరు), జి. నాగేంద్ర (పెద్దపంజాణి), సయ్యద్‌ షాబుద్దీన్‌ (గుడుపల్లె), పి.సుబ్బలక్ష్మమ్మ (పాలసముద్రం), కె.శ్రీధర్‌ (రామకుప్పం), స్వర్ణలత (బైరెడ్డిపల్లె), ఎ.సురేష్‌ కుమార్‌ (వి.కోట), టి.ఆర్‌.మురళీకృష్ణ (శాంతిపురం).

ఫ కడప జిల్లా నుంచి వచ్చిన.. పి.శ్రీనివాసరెడ్డి (చిత్తూరు అర్బన్‌), ఎన్‌.చంద్రశేఖర్‌ రెడ్డి (నగరి), ఎం.వి. సుబ్రహ్మణ్యంరెడ్డి (పుంగనూరు), ఎం.దైవాదీనం (యాదమరి)కి మండలాలు కేటాయించారు.

ఫ ఉమ్మడి కర్నూలు జిల్లా నుంచి వచ్చిన తహసీల్దార్లు.. కె.నాగమణికి (నిండ్ర), షేక్‌ హసీనాబీ (తవణంపల్లె), టి.శ్రీనివాసులు (ఐరాల), డి.ఆల్ర్ఫెడ్‌ (శ్రీరంగరాజపురం), జి.వి.మల్లికార్జున రావు (విజయపురం), పి.షేక్‌ మొహిద్దీన్‌ (రొంపిచెర్ల), జి.సుభద్రమ్మ (బంగారుపాళ్యం), ఎం.శివరాముడు (పూతలపట్టు), ఎస్‌.సుభద్ర (పెనుమూరు), బి.పుష్పకుమారి (కార్వేటినగరం), ఐ.వేణుగోపాల్‌రావు (కుప్పం ఆర్డీవో కార్యాలయ పరిపాలన అధికారి), ఎస్‌.రవి (గంగాధరనెల్లూరు), డి. చంద్రశేఖర్‌ (నగరి ఆర్డీవో కార్యాలయ పరిపాలన అధికారి)గా నియమితులయ్యారు.

Updated Date - Feb 02 , 2024 | 12:31 AM