Share News

ఎంపీడీవోలకు మండలాల కేటాయింపు

ABN , Publish Date - Feb 07 , 2024 | 01:07 AM

ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు ఇతర జిల్లాల నుంచి ఉమ్మడి చిత్తూరు జిల్లాకు వచ్చిన వారికి పోస్టింగ్స్‌ ఇస్తూ మంగళవారం ఉత్తర్వులు జారీచేశారు.

ఎంపీడీవోలకు మండలాల కేటాయింపు

చిత్తూరు కలెక్టరేట్‌, ఫిబ్రవరి 6: ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు ఇతర జిల్లాల నుంచి ఉమ్మడి చిత్తూరు జిల్లాకు వచ్చిన వారికి పోస్టింగ్స్‌ ఇస్తూ మంగళవారం ఉత్తర్వులు జారీచేశారు. ఉమ్మడి చిత్తూరు జిల్లా నుంచి ఎంపీడీవోల్లో 23 మందిని అనంతపురం జిల్లాకు, ముగ్గురిని కడప జిల్లాకు బదిలీ చేశారు. వారి స్థానంలో చిత్తూరు జిల్లాకు 17మందిని నెల్లూరు జిల్లాకు, 15 మందిని కడప జిల్లా నుంచి వెరసి 32 మందిని బదిలీ చేశారు. ఉమ్మడి చిత్తూరు జిల్లా పరిధిలో మండలాల్లో ఖాళీలను బట్టి పోస్టింగ్‌ ఇచ్చారు. ఎన్నికలు ముగిసి కొత్త ప్రభుత్వం బాధ్యతలు స్వీకరించేవరకు వీరు చిత్తూరు జిల్లాలో విధులు నిర్వహించనున్నారు.

కేటాయించిన మండలాలివీ..

ఫ కడప జిల్లా నుంచి వచ్చిన 13 మందిలో సి.వెంకటేశు (చౌడేపల్లి), జి.రవికుమార్‌ రెడ్డి (నగరి), కె.వి.శ్రీధర్‌ నాయుడు (కార్వేటినగరం), టి.వెంగముని రెడ్డి (పుంగనూరు), పి.వరప్రసాద్‌ (సోమల), జె.సుజాతమ్మ (వడమాలపేట), ఎస్‌.నూర్జహాన్‌ (బి.కొత్తకోట), ఎ.జగదీశ్వర్‌ రెడ్డి (గుర్రంకొండ), జి.రెడ్డయ్య (కేవీపల్లి), సి.రామక్రిష్ణయ్య (కలికిరి), బి.మైథిలి (నిమ్మనపల్లి), సి. వెంకటరమణయ్య (పెద్దమండ్యం), జి.కృష్ణమూర్తి (తంబళ్ళపల్లి) మండలాల్లో పోస్టింగులు ఇచ్చారు.

ఫ నెల్లూరు జిల్లా నుంచి వచ్చిన 17 మందిలో... ఎన్‌ గోపి (గుడుపల్లి), ఎం.భవాని (నిండ్ర), కె.వెంకటేశ్వరరావు (పెనుమూరు), కె.సురే్‌షబాబు (పులిచెర్ల), బి.సింగయ్య (యాదమరి), పి.ప్రసన్నకుమారి (పూతలపట్టు), జి.వెంకటేశ్వర్లు (తవణంపల్లి), కె.గోవర్ధన్‌ (వి.కోట), ఎం.బ్రహ్మయ్య (విజయపురం), ఎం.భాస్కర్‌ (గంగాధరనెల్లూరు), కె.షాలెట్‌ (బి.ఎన్‌. కండ్రిగ), వి.వి.సూర్యసాయి (చంద్రగిరి), కె.వి.శివప్రసాద్‌ (కేవీబీ పురం), కె.నాగేంద్రబాబు (పాకాల), కె.ప్రత్యూష (రామచంద్రాపురం), పి. ఐజాక్‌ ప్రవీణ్‌ (తొట్టంబేడు), ఎం.మధుసూదనరావు (ఎర్రావారిపాళ్యం) మండలాలను కేటాయిస్తూ పోస్టింగులు ఇచ్చారు.

Updated Date - Feb 07 , 2024 | 01:07 AM