ప్రయోగ వేదికపైకి అగ్నికుల్
ABN , Publish Date - Mar 06 , 2024 | 01:16 AM
ప్రైవేట్ రంగంలో రెండో రాకెట్ ప్రయోగానికి శ్రీహరికోటలోని షార్ సిద్ధమవుతోంది.త్వరలో అగ్నికుల్ రాకెట్‌ను ప్రయోగించనున్న నేపథ్యంలో రాకెట్‌ను షార్‌లోని ఏఎ్‌సఎల్వీ కాంప్లెక్స్‌లో అనుసంధానం చేశారు.

ప్రైవేట్ రంగంలో రెండో రాకెట్ ప్రయోగానికి శ్రీహరికోటలోని షార్ సిద్ధమవుతోంది.త్వరలో అగ్నికుల్ రాకెట్‌ను ప్రయోగించనున్న నేపథ్యంలో రాకెట్‌ను షార్‌లోని ఏఎ్‌సఎల్వీ కాంప్లెక్స్‌లో అనుసంధానం చేశారు. మంగళవారం రాకెట్‌ను ప్రైవేట్ ప్రయోగ వేదికకు తరలించారు. అగ్నికుల్ కాస్మో్‌స,మద్రాసు ఐఐటీ స్పేస్ టెక్నాలజీ స్టార్టప్ తరపున సబ్ ఆర్బిటల్ రాకెట్‌ను రూపొందించి షార్ నుంచి ప్రయోగించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. అగ్నికుల్ ప్రయోగ వాహకనౌకకు అగ్నిబాన్ సబార్బిటల్ టెక్నాలజీ డెమాన్‌స్ర్టేటర్ (ఎస్‌వోఆర్ టీఈడీ)గా నామకరణం చేశారు. ప్రస్తుతం ప్రయోగ వేదిక రాకెట్‌కు పలు తనిఖీలు జరుగుతున్నాయి. ఇది అగ్నిలెట్ ఇంజన్‌తో నడిచే సింగిల్ స్టేజ్ వాహక నౌక. ఈ సెమీ క్రయోజనిక్ ఇంజన్‌ను పూర్తిగా 3డీ సాంకేతికతతో రూపొందించారు. 6కేఎన్ సామర్ధ్యాన్ని కలిగిన ఈ రాకెట్‌లో 300 కిలోల పేలోడ్‌తో 700 కిలోమీటర్ల దూరంలో పంపే విధంగా డి.జైన్ చేశారు. షార్‌లో అగ్నికుల్‌కు చెందిన సొంత ప్రయోగ వేదిక, మిషన్ కంట్రోల్ సెంటర్‌ను గత ఏడాది ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే.
-సూళ్లూరుపేట