స్వామి దయతోనే యాక్టరయ్యా!
ABN , Publish Date - Aug 24 , 2024 | 01:51 AM
‘చదువుకునే రోజుల్లో సినిమాలు చూసి యాక్టర్‌ని చేయి అని సరదాగా దణ్ణం పెట్టుకుని అడిగితే వేంకటేశ్వరస్వామి నిజంగానే నన్ను నటిని చేసేశాడు. నిజానికి స్వామిని కోరుకోవాల్సిన అవసరం కూడా లేదు.
‘చదువుకునే రోజుల్లో సినిమాలు చూసి యాక్టర్‌ని చేయి అని సరదాగా దణ్ణం పెట్టుకుని అడిగితే వేంకటేశ్వరస్వామి నిజంగానే నన్ను నటిని చేసేశాడు. నిజానికి స్వామిని కోరుకోవాల్సిన అవసరం కూడా లేదు. వచ్చి దర్శనం చేసుకుంటే చాలు మన మనసులో ఉన్న ఏ కోరికైనా ఇట్టే తీర్చేసే దేవుడాయన’......తిరుమల వెంకన్నసై బిగ్‌బాస్-4 బ్యూటీ, లంబసింగి చిత్ర హీరోయిన్ దివికి వున్న భక్తి ప్రపత్తులివి.శ్రీవారి దర్శనానికి తరచూ వచ్చే అచ్చ తెలుగు నటి అయిన దివి స్వామివారి దర్శనంతో తన జీవితం మొత్తం మారిపోయిందంటున్నారు.
- తిరుమల, ఆంధ్రజ్యోతి
ఆరవ తరగతిలో ఉన్నప్పుడు మొదటిసారి వచ్చా
నేను ఆరో తరగతి చదువుతున్నప్పుడు మొదటిసారి ఫ్యామిలీతో తిరుమలకు వచ్చా. స్వామిని దర్శించుకున్నప్పుడు చెప్పలేని సంతోషం కలిగింది.అప్పడే నిర్ణయించుకున్నా. ఏడాదికి ఓసారైనా తిరుమలకు రావాలని. ఆ స్టేజ్ నుంచి ఇప్పుడు నెలకోసారి కచ్చితంగా రావాలనే వరకూ వెళ్లిపోయా. కాలేజీ రోజుల్లో సినిమాల్లో యాక్టర్లను చూసి నేను యాక్టర్ కావాలని కోరుకుంటే స్వామి నిజంగానే చేసేశాడు. ఇక్కడికి వచ్చి వెళితే చాలాచాలా పాజిటివ్ ఎనర్జీ వస్తుంది. మనకు కావాల్సినవన్నీ జరిగిపోతాయ్.అలా నిలబడి వెళ్లిపోతే చాలు మంచి జరుగుతుంది. ముఖ్యంగా వయసుతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరిలోనూ భక్తి ఉండాలి. అప్పుడే మనం సంతోషంగా, సేఫ్‌గా ఉంటాం. అందుకే కుటుంబ సభ్యులతోనే కాకుండా నా స్నేహితులు, బంధువులతో కుదిరినప్పుడల్లా తిరుమలకు వచ్చేస్తుంటా.
పుష్ప చూసి నేనెందుకు లేననుకున్నా
పుష్ప చూసినప్పుడు ఈ సినిమాలో కదా నేను ఉండాలి అనుకున్నా. వెంటనే పుష్ప-2లో నటించే అవకాశం వచ్చింది. ఇది కచ్చితంగా స్వామి లీలే. పుష్ప-2లో జర్నలిస్ట్ రోల్ చేశా. ఇప్పటికే ట్రైలర్ ద్వారా నాకు మంచి కామెంట్స్ వచ్చాయి. ఆ సినిమా విడుదల కోసం అందరితో పాటు నేనూ వెయిటింగ్.అలాగే బాలయ్యతో బాబీ దర్శకత్వంలో వస్తున్న సినిమాలో, బాబీడియోల్‌తో గోపీచంద్ రూపొందిస్తున్న సినిమాలో మంచి రోల్స్ లభించాయి. త్వరలో హాట్‌స్టార్‌లో ‘హరికథ’ అనే వెబ్ సీరిస్ ద్వారా వస్తున్నా. ‘లంబసింగి’ చిత్రం తర్వాత సోలో క్యారెక్టర్లు చాలా వస్తున్నాయి. స్వామి బ్లెస్సింగ్స్‌తో మంచి మంచి పాత్రలొస్తున్నాయి.
తెలుగులో పెద్ద యాక్టర్స్‌తో నటించాలనుంది
బిగ్‌బాస్ ద్వారా 50 శాతం మంచి పేరు వస్తే, మెగా స్టార్ చిరంజీవి ప్రోత్సాహంతో ఇంకో 50 శాతం అవకాశాలు వస్తున్నాయి. ఇప్పటికే చిరంజీవి, అల్లు అర్జున్, బాలయ్య, మహే్‌షబాబుతో నటించా. ఇంకా పెద్ద యాక్టర్లతో నటించాలనుంది. తమిళ, కన్నడ పరిశ్రమల్లో కూడా మంచి అవకాశాలు వస్తున్నాయి.అయితే నా మనసుకు నచ్చి పాత్రల్లోనే నటిస్తున్నా.
హాలీవుడ్‌లో నటించాలన్నదే నా డ్రీమ్
తెలుగులో మంచి పేరు తెచ్చుకోవడంతో పాటు హాలీవుడ్‌లో నటించాలన్నది నా కల. కెరీర్ మొదట్లోనే మైక్రోసాఫ్ట్ యాడ్‌లో నటించా. అస్కార్ విన్నర్ రాబర్డ్ రిచర్డ్‌తో నటించా. అలాగే ఇటలీలో ‘ది ఈక్వలైజర్3’కి ఆడిషన్ ఇచ్చా. ఎప్పటికైనా హాలీవుడ్‌లో నటించాలని వుంది.