ఈసీ నియమిత సిట్‌లో ఏసీబీ డీఎస్పీకి చోటు
ABN , Publish Date - May 18 , 2024 | 12:59 AM
రాష్ట్రంలో ఎన్నికల పోలింగ్ రోజు, తర్వాత సంభవించిన హింసాత్మక ఘటనలపై విచారణ నిమిత్తం ఎన్నికల కమిషన్ నియమించిన స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్‌లో తిరుపతి ఏసీబీ డీఎస్పీ కె.రవిమనోహరాచారికి చోటు దక్కింది. ఎస్‌ఐగా, సీఐగా, డీఎస్పీగా ఉమ్మడి చిత్తూరు జిల్లాలో సుదీర్ఘకాలం ఈయన పనిచేశారు.
తిరుపతి, మే 17 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో ఎన్నికల పోలింగ్ రోజు, తర్వాత సంభవించిన హింసాత్మక ఘటనలపై విచారణ నిమిత్తం ఎన్నికల కమిషన్ నియమించిన స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్‌లో తిరుపతి ఏసీబీ డీఎస్పీ కె.రవిమనోహరాచారికి చోటు దక్కింది. ఎస్‌ఐగా, సీఐగా, డీఎస్పీగా ఉమ్మడి చిత్తూరు జిల్లాలో సుదీర్ఘకాలం ఈయన పనిచేశారు. కౌంటర్ ఇంటెలిజెన్స్, స్పెషల్ బ్రాంచి, లా అండ్ ఆర్డర్ వంటి మూడు కీలక విభాగాల్లో విధులు నిర్వర్తించిన ఈయనకు ఈ ప్రాంతంపై సమగ్రమైన అవగాహన, ఇక్కడి పరిస్థితులను అంచనా వేయడంలో అవగాహన వున్నాయి. అనేక సంచలనాత్మక కేసులను పరిష్కరించి సమర్ధుడైన అధికారిగా గుర్తింపు పొందారు. తాజాగా ఎన్నికల పోలింగ్ రోజు, తర్వాత తిరుపతి, పల్నాడు, అనంతపురం జిల్లాల్లో జరిగిన పలు హింసాత్మక ఘటనలపై లోతుగా విచారణ జరిపి, స్థానిక పోలీసు అధికారుల వైఫల్యాన్ని గుర్తించడంతో పాటు కేసుల నమోదులో అవసరమైన మార్పు చేర్పులు, సెక్షన్ల మార్పు చేర్పులను సూచించడం, శాంతిభద్రతల నిర్వహణకు సంబంధించిన అంశాలపై సిఫారసులు చేయడం వంటివి సిట్‌కు ఈసీ అప్పగించిన బాధ్యతలు. సిట్‌లో మొత్తం 13మంది సభ్యులుండగా అందులో రాయలసీమ నుంచీ ఎంపికైన ఇద్దరు అధికారుల్లో రవిమనోహరాచారి ఒకరు. ఈసీ ద్వారా ప్రత్యేక దర్యాప్తు బృందంలో నియమితులు కావడం ఆయన సమర్ధతకు, అనుభవానికి దక్కిన గుర్తింపుగా ఆ శాఖ వర్గాలు భావిస్తున్నాయి.