Share News

ఓటరుకార్డుకు ఆధార్‌కార్డు అనుసంధానం చేయాలి

ABN , Publish Date - Jan 12 , 2024 | 12:28 AM

తిరుపతి నగరపాలక సంస్థ మాజీ కమిషనర్‌ గిరీషా లాగిన్‌ ద్వారా చేర్చిన 30వేల దొంగ ఓట్లను తొలగించాలని, అలాగే ఓటరుకార్డుకు ఆధార్‌ అనుసంధానం చేయాలని టీడీపీ తిరుపతి నియోజకవర్గ ఇన్‌చార్జి, మాజీ ఎమ్మెల్యే సుగుణమ్మ డిమాండ్‌ చేశారు.

ఓటరుకార్డుకు ఆధార్‌కార్డు అనుసంధానం చేయాలి
టీడీపీ నేతలతో కలిసి మీడియాతో మాట్లాడుతున్న సుగుణమ్మ

టీడీపీ ఇన్‌చార్జి సుగుణమ్మ

తిరుపతి(తిలక్‌రోడ్‌), జనవరి 11: తిరుపతి నగరపాలక సంస్థ మాజీ కమిషనర్‌ గిరీషా లాగిన్‌ ద్వారా చేర్చిన 30వేల దొంగ ఓట్లను తొలగించాలని, అలాగే ఓటరుకార్డుకు ఆధార్‌ అనుసంధానం చేయాలని టీడీపీ తిరుపతి నియోజకవర్గ ఇన్‌చార్జి, మాజీ ఎమ్మెల్యే సుగుణమ్మ డిమాండ్‌ చేశారు. గురువారం ఆమె మీడియాతో మాట్లాడుతూ తిరుపతి లోక్‌సభ ఉప ఎన్నికల్లో అప్పటి కమిషనర్‌ గిరీషా లాగిన్‌ ద్వారా 30వేల దొంగ ఓట్లను స్థానిక ఎమ్మెల్యే కరుణాకరరెడ్డి కుమారుడు అభినయ్‌రెడ్డి నేతృత్వంలో చేర్చారని ఆరోపించారు. వెంటనే ఎన్నికల కమిషన్‌ దీనిపై దృష్టి సారించి తొలగించాలని డిమాండ్‌ చేశారు. నిజమైన ఓటరు ఓటు వేయాలంటే ఓటరు కార్డుకు ఆధార్‌ అనుసంధానం చేయాలని కోరారు. ప్రజల ఆస్తులకు అధికార వైసీపీ ఎసరు పెడుతోందని, అందుకోసమే ల్యాండ్‌ టైటిల్‌ యాక్ట్‌ను తీసుకువచ్చిందని ఆరోపించారు. వైసీపీ కుయుక్తులను ప్రజలు అర్థం చేసుకుంటున్నారని, రానున్న ఎన్నికల్లో టీడీపీ, జనసేనకు మద్దతు తెలపడానికి సిద్ధంగా ఉన్నారన్నారు. ప్రజాభీష్టంతో ఎన్నికల్లో గెలవాలే కాని దొంగ ఓట్లను అడ్డుపెట్టుకుని నెగ్గాలనుకోవడం సరికాదని హితవు పలికారు. టీడీపీ నాయకులు సూరా సుఽధాకర రెడ్డి, కార్పొరేటర్‌ ఆర్‌సీ మునికృష్ణ, దంపూరి భాస్కర్‌యాదవ్‌, మహేష్‌ యాదవ్‌, ఊట్ల సురేంద్రనాయుడు, కంకణాల రజనీకాంత్‌నాయుడు, మునిశేఖర్‌ రాయల్‌, ఆముదాల తులసీదాస్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Jan 12 , 2024 | 12:28 AM