Share News

పంట పొలాలపైపడ్డ ఒంటరి ఏనుగు

ABN , Publish Date - Apr 08 , 2024 | 01:05 AM

ఐరాల మండలంలోని వేదగిరివారిపల్లె పంచాయతీ ఎస్టీ కాలనీలో ఆదివారం వేకువ జామున ఒంటరి ఏనుగు ఒకటి పంట పొలాలపై పడింది.

పంట పొలాలపైపడ్డ ఒంటరి ఏనుగు

ఐరాల, ఏప్రిల్‌ 7: ఐరాల మండలంలోని వేదగిరివారిపల్లె పంచాయతీ ఎస్టీ కాలనీలో ఆదివారం వేకువ జామున ఒంటరి ఏనుగు ఒకటి పంట పొలాలపై పడింది. గ్రామానికి చెందిన పలువురి మామిడి తోటల్లో కొమ్మలు విరిచేసింది. కొబ్బరి తోటలో చెట్లు, వరి పంటను నాశనం చేసింది. అటవీశాఖ అధికారులకు ఎన్నిసార్లు చెప్పినా వారు పట్టించుకోవడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా అటవీశాఖ అధికారులు స్పందించి అటవీప్రాంతం వద్ద సోలార్‌ ఫెన్సింగ్‌ను ఏర్పాటు చేసి ఆదుకోవాలని వేడుకుంటున్నారు.

Updated Date - Apr 08 , 2024 | 01:05 AM