Share News

ఇంటర్‌ ఫలితాల్లో 7వ స్థానం

ABN , Publish Date - Apr 13 , 2024 | 01:23 AM

ఇంటర్మీడియట్‌ పరీక్ష ఫలితాల్లో తిరుపతి జిల్లా ఏడవ స్థానంలో నిలిచింది.

ఇంటర్‌ ఫలితాల్లో  7వ స్థానం
ఆర్‌ఐవో ప్రభాకర రెడ్డి

తిరుపతి(విద్య), ఏప్రిల్‌ 12 : ఇంటర్మీడియట్‌ పరీక్ష ఫలితాల్లో తిరుపతి జిల్లా ఏడవ స్థానంలో నిలిచింది. ఈ ఏడాది తొలిసారిగా 26 జిల్లాల ప్రాతిపదికన నిర్వహించిన పరీక్షల్లో ప్రథమ ఇంటర్‌లో 29,915 మందికిగాను 20,919 మంది విద్యార్థులు పాసయ్యారు. 70 శాతం ఉత్తీర్ణతతో జిల్లాను 7వ స్థానంలో నిలిపారు. ద్వితీయ ఇంటర్‌లో 25,990 మంది విద్యార్థులకుగాను 21,062 మంది పాసయ్యారు. 81 శాతం ఉత్తీర్ణతతో జిల్లాను 7వ స్థానంలో నిలిపారు.ఒకేషనల్‌ విభాగం ప్రథమలో 1,086 మందికిగాను 595మంది పాసై 55 శాతం, ద్వితీయలో 963మందికి 652 మంది పాసై 68 శాతం ఉత్తీర్ణత సాధించినట్టు ఆర్‌ఐవో జీవీ ప్రభాకర రెడ్డి తెలిపారు.గతంలోలాగే ఈ ఏడాదికూడా ఉత్తీర్ణతలో అమ్మాయిలే ఆధిపత్యాన్ని ప్రదర్శించారు. ప్రథమ సంవత్సర జనరల్‌ విభాగంలో 15,319 బాలురకుగాను 10,220 మంది పాసై 67 శాతం ఉత్తీర్ణత నమోదుచేయగా 14,596 మంది బాలికలకుగాను 10,699 మంది పాసై 73 శాతం ఉత్తీర్ణత సాధించారు.ద్వితీయ సంవత్సర బాలుర విభాగంలో 13,012 మందికిగాను 10,218 మంది పాసై 79 శాతం ఉత్తీర్ణత నమోదు చేయగా 12,978 మంది బాలికలకు 10,844 మంది పాసై 84 శాతం ఉత్తీర్ణత సాధించారు.ప్రథమ ఒకేషనల్లో 586 మంది బాలురకు 250 మంది పాసై 43 శాతం ఉత్తీర్ణత సాధించగా 500 బాలికలకు 345 మంది పాసై 69 శాతం ఉత్తీర్ణత నమోదు చేశారు.ద్వితీయ ఒకేషనల్‌లో 477మంది బాలురకు 248 మంది పాసై 52 శాతం ఉత్తీర్ణత నమోదు చేయగా 486 మంది బాలికలకు 404 మంది పాసై 83 శాతం ఉత్తీర్ణత సాధించారు.

మేనేజ్‌మెంట్ల వారీగా ఫలితాలు

ఏపీఆర్జేసీ కళాశాల నుంచి ప్రథమ ఇంటర్‌ జనరల్‌ విభాగంలో 94మంది విద్యార్థులకుగాను 81మంది పాసవ్వగా ద్వితీయలో 68మందికిగాను 61మంది పాసయ్యారు.నాలుగు ఎయిడెడ్‌ కళాశాలల నుంచి ప్రథమలో 1559మందికిగాను 1011మంది పాసవగా ద్వితీయలో 1281మందికిగాను 1003మంది పాసయ్యారు. 10 సోషల్‌ వెల్ఫేర్‌ రెసిడెన్షియల్‌ కళాశాలలకు సంబంధించి ప్రథమలో 583మందికిగాను 498 మంది, ద్వితీయలో 585 మందికిగాను 520మంది ఉత్తీర్ణులయ్యారు. మూడు ట్రైబల్‌ వెల్ఫేర్‌ కళాశాలల నుంచి ప్రథమలో 247మందికిగాను 193 మంది, ద్వితీయలో 214మందికి 176మంది పాసయ్యారు. రెండు బీసీ రెసిడెన్షియల్‌ కళాశాలలనుంచి ప్రథమలో 240 మందికిగాను 238 మంది, ద్వితీయలో 172మందికిగాను 169 మంది ఉత్తీర్ణులయ్యారు.రెండు ఇన్సెంటివ్‌ కళాశాలల్లో ప్రథమలో 77 మందికి 29 మంది, ద్వితీయలో 83మందికి 54మంది, 5 కేజీబీవీల్లో ప్రథమలో 127మందికి 71మంది, ద్వితీయలో 109మందికి 87మంది, ఐదు ఏపీ మోడల్‌ స్కూళ్లలో ప్రథమలో 264మందికి 133మంది, ద్వితీయలో 282మందికి 219మంది ఉత్తీర్ణులయ్యారు.111 ప్రైవేటు అన్‌ఎయిడెడ్‌ జూనియర్‌ కళాశాలల్లో ప్రథమలో 24388 మందికి 17743మంది, ద్వితీయలో 21449 మందికి 17839 మంది ఉత్తీర్ణులయ్యారు.ప్రైవేటు కాంపోజిటివ్‌ కళాశాలలకు సంబంధించి ప్రథమలో 96మందికిగాను 65మంది, ద్వితీయలో 87మందికిగాను 84మంది ఉత్తీర్ణులయ్యారు. మొత్తంగా 185 కళాశాలలకు సంబంధించి ప్రథమలో 29915 మందికిగాను 20919మంది, ద్వితీయలో 25990 మందికిగాను 21062మంది, ఒకేషనల్‌ ప్రథమలో 1086 మందికి 595మంది, ద్వితీయలో 963మందికి 652మంది ఉత్తీర్ణులయ్యారు.

ప్రభుత్వ, హైస్కూల్‌ ప్లస్‌లలో తగ్గిన ఉత్తీర్ణత

ఇంటర్‌ ఫలితాల్లో ప్రభుత్వ కళాశాలలు ఆశించినంత ఉత్తీర్ణత సాధించలేకపోయాయి. 21 ప్రభుత్వ కళాశాలల నుంచి ప్రథమలో 1707 మందికిగాను 684 మంది ఉత్తీర్ణులు కాగా ద్వితీయలో 1434 మందికిగాను 755 మంది ఉత్తీర్ణులయ్యారు. అలాగే ఒకేషనల్‌ ప్రథమలో 830 మందికి 432మంది పాసవ్వగా ద్వితీయలో 707మందికి 473మంది పాసయ్యారు. 20 హైస్కూల్‌ ప్లస్‌లకు సంబంఽధించి ప్రథమలో 533మందికి 173మంది పాసవగా ద్వితీయలో 226 మందికి కేవలం 95మంది మాత్రమే ఉత్తీర్ణులు కావడం గమనార్హం.

మే 24నుంచి అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ

ఇంటర్మీడియట్‌ అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ పరీక్షలు మే 24 నుంచి జూన్‌ 1 వరకు జరుగనున్నాయి. ప్రతీ రోజూ ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, మధ్యాహ్నం 2.30 నుంచి సాయంత్రం 5.30 వరకు రెండు సెషన్లలో ప్రథమ, ద్వితీయ విద్యార్థులకు పరీక్షలు జరుగనున్నాయి. అంతకంటే ముందు మే ఒకి నుంచి 4వ తేదీ వరకు అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ ప్రాక్టికల్‌ పరీక్షలు జరుగనున్నాయి. ఈ పరీక్షలకు సంబంధించి ఈనెల 18 నుంచి 24వ తేదీలోపు విద్యార్థులు ఫీజు చెల్లించాల్సి వుంటుంది. కాగా ఇంటర్‌ ఫలితాల్లో తక్కువ మార్కులు వచ్చిన విద్యార్థులు, ఫెయిల్‌ అయినవారు ఎలాంటి ఆందోళనకు, ఒత్తిడికి లోనుకావద్దని విద్యార్థులు తల్లిదండ్రులుకూడా పిల్లలకు మనోధైర్యాన్ని కల్పించి అడ్వాన్స్‌డ్‌ పరీక్షల్లో మంచి ఫలితాలు సాధించేలా ప్రోత్సహించాలి.

100శాతం ఉత్తీర్ణత

సత్యవేడు ప్రభుత్వ జూనియర్‌ కళాశాల, అంబేడ్కర్‌ బాలికల గురుకుల కళాశాల విద్యార్థులు 100 శాతం ఉత్తీర్ణత సాధించారు.ఎంపీసీ విద్యార్థిని మునిశ్రీ 939 మార్కులు, దిలీ్‌పకుమార్‌ 920, బైపీసీలో వినోలియా 949 మార్కులు సాధించారు.మొదటి సంవత్సరం ఎంపీసీలో 470 మార్కులకు గాను లక్ష్మీప్రసాద్‌ 458, తనుష్‌ 446, మార్కులు సాధించారు.గురుకుల కళాశాలలో బైపీసీలో డి.లావణ్య 986,మొదటి సంవత్సరం ఎంపీసీలో రోజా 463, త్రిష 461, మానస 459, బైపీసీలో 440 మార్కులకు గాను గీతిక 427, హర్షిత 426, భువన భాషిత 421 మార్కులు సాధించారు.దొరవారిసత్రం మండలంలోని కస్తూర్బా కళాశాల కూడా వందశాతం ఉత్తీర్ణత సాధించింది.

Updated Date - Apr 13 , 2024 | 01:23 AM