సివిల్స్ ప్రిలిమినరీ పరీక్షలకు 5,449 మంది హాజరు
ABN , Publish Date - Jun 17 , 2024 | 01:39 AM
జిల్లాలో ఆదివారం జరిగిన యూపీఎస్సీ సివిల్స్ ప్రిలిమినరీ పరీక్షలు ప్రశాంత వాతావరణంలో ముగిశాయి.

తిరుపతి(కలెక్టకరేట్), జూన్ 16: జిల్లాలో ఆదివారం జరిగిన యూపీఎస్సీ సివిల్స్ ప్రిలిమినరీ పరీక్షలు ప్రశాంత వాతావరణంలో ముగిశాయి. ఉదయం, మధ్యాహ్నం రెండు సెషన్లలో పరీక్ష జరిగింది. తిరుపతిలోని 11 పరీక్షా కేంద్రాల్లో 5,518మంది అభ్యర్థులు పరీక్షలు రాయాల్సి ఉండగా 5,449మంది హాజరయ్యారు. ఉదయం 2,728మంది (49.44శాతం), మధ్యాహ్నం 2,721మంది (49.31 శాతం)గా హాజరయ్యారు. పకడ్బందీగా పరీక్షలు నిర్వహించామని కలెక్టర్ ప్రవీణ్‌కుమార్,డీఆర్వో తెలిపారు.