ఇంటర్ అడ్వాన్డ్స్ సప్లిమెంటరీ ఫలితాల్లో 45 శాతం ఉత్తీర్ణత
ABN , Publish Date - Jun 27 , 2024 | 01:11 AM
ఇంటర్ అడ్వాన్డ్స్ సప్లిమెంటరీ ఫలితాల్లో జిల్లా విద్యార్థులు 45 శాతం ఉత్తీర్ణత సాధించారు. మొదటి సంవత్సరం ఫెయిలైన వారితో పాటు బెటర్‌మెంట్‌కు మే నెల 24 నుంచి జూన్ ఒకటో తేదీ వరకు పరీక్షలు నిర్వహించారు. ఈ ఫలితాలు బుధవారం విడుదలయ్యాయి. ఈ ఫలితాల్లో జిల్లా ఏడో స్థానంలో నిలిచింది.

చిత్తూరు (సెంట్రల్), జూన్ 26: ఇంటర్ అడ్వాన్డ్స్ సప్లిమెంటరీ ఫలితాల్లో జిల్లా విద్యార్థులు 45 శాతం ఉత్తీర్ణత సాధించారు. మొదటి సంవత్సరం ఫెయిలైన వారితో పాటు బెటర్‌మెంట్‌కు మే నెల 24 నుంచి జూన్ ఒకటో తేదీ వరకు పరీక్షలు నిర్వహించారు. ఈ ఫలితాలు బుధవారం విడుదలయ్యాయి. ఈ ఫలితాల్లో జిల్లా ఏడో స్థానంలో నిలిచింది. 5,817 మంది విద్యార్థులకు గాను 2,597 మంది (45 శాతం) ఉత్తీర్ణత సాధించగా, 3,220 మంది ఫెయిలయ్యారు. ఓకేషనల్‌లో జిల్లా 20వ స్థానంలో నిలిచింది. 814 మందికి గాను 368 మంది (45 శాతం) ఉత్తీర్ణత సాధించగా, 446 మంది ఫెయిలయ్యారు. కాగా, ఈనెల 28 నుంచి జూలై 4వ తేదీ వరకు విద్యార్థులు వెయ్యి రూపాయలు చెల్లించి రీవెరిఫికేషన్ చేయించుకునేందుకు ఇంటర్మీడియట్ బోర్డు అవకాశం కల్పించింది. జూలై ఒకటి నుంచి మార్కుల మెమోలను ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉంచనున్నట్లు అధికారులు తెలిపారు.
టెన్త్ సప్లిమెంటరీలో 79 శాతం
టెన్త్ సప్లిమెంటరీ ఫలితాల్లో జిల్లాలో 79 శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. గత నెల 24 నుంచి జూన్ 10వ తేదీ వరకు సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహించగా, ఆరు నుంచి 9వ తేదీ వరకు మూల్యాంకనం చేపట్టారు. జిల్లాలో 1,966 మంది పరీక్షలు రాయగా, 1,550 మంది (78.84 శాతం) ఉత్తీర్ణులయ్యారు. 1,306 మంది బాలురకు గాను 1,015 మంది (77.72 శాతం) ఉత్తీర్ణత సాధించారు. 660 మంది బాలికలకు గాను 535 మంది (81.06 శాతం) ఉత్తీర్ణత సాధించారు. కాగా గురువారం నుంచి జూలై 1వ తేదీ వరకు విద్యార్థులు రీవెరిఫికేషన్‌కు దరఖాస్తు చేసుకోవచ్చని విద్యాశాఖ అధికారులు తెలిపారు.