Share News

నాలుగో రోజు 44 నామినేషన్లు

ABN , Publish Date - Apr 23 , 2024 | 12:27 AM

సార్వత్రిక ఎన్నికల నామినేషన్ల ప్రక్రియలో భాగంగా నాలుగో రోజైన సోమవారం 44 దాఖలయ్యాయి. ఇందులో పార్లమెంటు స్థానానికి 7, ఏడు అసెంబ్లీ స్థానాలకు 37 నామినేషన్లు అందాయి

నాలుగో రోజు 44 నామినేషన్లు

చిత్తూరు కలెక్టరేట్‌, ఏప్రిల్‌ 22: సార్వత్రిక ఎన్నికల నామినేషన్ల ప్రక్రియలో భాగంగా నాలుగో రోజైన సోమవారం 44 దాఖలయ్యాయి. ఇందులో పార్లమెంటు స్థానానికి 7, ఏడు అసెంబ్లీ స్థానాలకు 37 నామినేషన్లు అందాయి. దీంతో ఇప్పటివరకు అందిన మొత్తం నామినేషన్ల సంఖ్య 93కు చేరింది. చిత్తూరు పార్లమెంటు నియోజకవర్గ స్థానానికి వైసీపీ తరఫున రెడ్డప్ప, ఆయన సతీమణి రెడ్డమ్మ రెండు సెట్ల చొప్పున, కాంగ్రెస్‌ నుంచి చిట్టిబాబు, జాతీయ జనసేన నుంచి దుగ్గిరాల నాగేశ్వరరావు, నేషనల్‌ మహాసభ పార్టీ నుంచి జానకీరామారావు ఒక్కో నామినేషన్‌ దాఖలు చేశారు. నగరికి ఇండిపెండెంట్‌గా నారాయణస్వామి మొదలి నామినేషన్‌ వేశారు. పలమనేరుకు అమరనాథరెడ్డి, ఆయన సతీమణి రేణుకారెడ్డి టీడీపీ నుంచి, వైసీపీ నుంచి వెంకటేగౌడ, ఇండిపెండెంట్లుగా బాషా, అరుణ్‌కుమార్‌, పవిత్రకావలి నామినేషన్లను అందించారు. కుప్పం నుంచి టీడీపీ తరఫున చంద్రబాబు నాయుడు, కాంగ్రెస్‌ నుంచి గోవిందరాజులు, వైసీపీ నుంచి కృష్ణ రాఘవ జయేంద్ర భరత్‌, మురళీధర్‌, భారతీయ ప్రజాగళ కళ్యాణ పక్షపాతి తరఫున అక్బర్‌, ఇండిపెండెంట్‌గా రామచంద్రప్ప నామినేషన్లు ఇచ్చారు. పుంగనూరుకు కాంగ్రెస్‌ నుంచి మురళీమోహన్‌, టీడీపీ తరఫున చల్లా రామచంద్రారెడ్డి, చల్లా సుప్రియ, చల్లా పూజారెడ్డి, సోషియల్‌ డెమోక్రటివ్‌ పార్టీ ఆఫ్‌ ఇండియా తరఫున జమీర్‌ ఒక్కో నామినేషన్‌ దాఖలు చేశారు. జీడీ నెల్లూరుకు అఖిల భారతీయ జనసంఘ్‌ నుంచి రామరాజు, టీడీపీ నుంచి రవికుమార్‌, ఇండిపెండెంట్‌ అభ్యర్థిగా రాము, బహుజన సమాజ్‌ పార్టీ నుంచి భాస్కర్‌ నామినేషన్లు వేశారు. చిత్తూరుకు వైసీపీ నుంచి ఇందుమతి రెండు సెట్లు, కాంగ్రెస్‌ నుంచి తుకారాం, ఇండిపెండెంట్‌గా ప్రభాకర్‌రెడ్డి, టీడీపీ నుంచి కంచర్ల ప్రతిమ నామినేషన్లను అందించారు. పూతలపట్టుకు టీడీపీ తరఫున మురళీ మోహన్‌, వైసీపీ నుంచి సునీల్‌కుమార్‌, కాంగ్రెస్‌ తరఫున బాబు, జనసంఘ్‌ నుంచి కట్టమంచి విశ్వనాథ సాయి మోహన్‌, ఇండిపెండెంట్‌గా రాజా ఒక్కో నామినేషన్‌ వేశారు. బీఎస్పీ తరఫున నాగేశ్వర రెండు సెట్ల నామినేషన్లు దాఖలు చేశారు.

Updated Date - Apr 23 , 2024 | 12:27 AM