చిత్తూరులో 42.9 డిగ్రీల ఉష్ణోగ్రత
ABN , Publish Date - Apr 03 , 2024 | 01:01 AM
ఎండలు మండుతున్నాయి. రోజు రోజుకూ ఉష్ణోగ్రత పెరుగుతుండటంతో పలు మండలాల్లో 40 డిగ్రీలకు మించి నమోదవుతున్నాయి.

చిత్తూరు కలెక్టరేట్/గంగాధరనెల్లూరు, ఏప్రిల్ 2: ఎండలు మండుతున్నాయి. రోజు రోజుకూ ఉష్ణోగ్రత పెరుగుతుండటంతో పలు మండలాల్లో 40 డిగ్రీలకు మించి నమోదవుతున్నాయి. మంగళవారం ఎండ తీవ్రతకు భయపడి ప్రజలు రోడ్డుమీదకు రాలేకపోయారు. అత్యధికంగా చిత్తూరులో 42.9 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. మండలాల వారీగా. గుడుపల్లె, విజయపురం, నగరిలో 42.4 డిగ్రీల చొప్పున, ఎస్‌ఆర్‌పురంలో 42.3, తవణంపల్లెలో 42.2, నిండ్రలో 41.7, గుడిపాల, పుంగనూరులో 41.1 చొప్పున, పాలసముద్రంలో 40.5, చౌడేపల్లె, యాదమరి, రొంపిచెర్లలో 39.9 వంతున, బంగారుపాళ్యం, శాంతిపురంలో 39.8, వెదురుకుప్పంలో 39.6, కుప్పం, గంగవరం, సోమల, సదుం, వి.కోటలో 39.4 చొప్పున, పెద్ద పంజాణిలో 39.3, కార్వేటినగరంలో 39.2, జీడీ నెల్లూరులో 39, బైరెడ్డిపల్లెలో 38.5, పెనుమూరులో 38.4, పలమనేరులో 37.8, రామకుప్పం, పూతలపట్టులో 37.7, పులిచెర్లలో 37.6, ఐరాలలో 37.5 డిగ్రీల చొప్పున ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఈ ఎండల తీవ్రతతో ప్రధాన రహదారులు నిర్మానుష్యంగా మారుతున్నాయి. ఉదయం 11 గంటలు దాటాక కొందరు డ్రైవర్లు వాహనాలను రోడ్డుపక్కన పెట్టేసి చెట్లకింద సేదతీరుతున్నారు.