Share News

నాలుగో రోజు 42 నామినేషన్లు

ABN , Publish Date - Apr 23 , 2024 | 12:32 AM

తిరుపతి జిల్లావ్యాప్తంగా సోమవారం 42 నామినేషన్లు దాఖలయ్యాయి.తిరుపతి పార్లమెంటుకు బీజేపీ అభ్యర్థి వెలగపల్లి వరప్రసాద్‌, వైసీపీ అభ్యర్థి మద్దిల గురుమూర్తి నామినేషన్లు వేశారు.

నాలుగో రోజు 42 నామినేషన్లు
నామినేషన్‌ వేసేందుకు ప్రదర్శనగా వస్తున్న తిరుపతి పార్లమెంటు బీజేపీ అభ్యర్థి వెలగపల్లి వరప్రసాద్‌తో జనసేన ఎమ్మెల్యే అభ్యర్థి ఆరణి శ్రీనివాసులు తదితరులు

తిరుపతి, ఏప్రిల్‌ 22 (ఆంధ్రజ్యోతి): తిరుపతి జిల్లావ్యాప్తంగా సోమవారం 42 నామినేషన్లు దాఖలయ్యాయి.తిరుపతి పార్లమెంటుకు బీజేపీ అభ్యర్థి వెలగపల్లి వరప్రసాద్‌, వైసీపీ అభ్యర్థి మద్దిల గురుమూర్తి నామినేషన్లు వేశారు. అలాగే అసెంబ్లీ స్థానాలకు సంబంధించి చంద్రగిరి నుంచీ టీడీపీ అభ్యర్థి పులివర్తి వెంకటమణిప్రసాద్‌ అలియాస్‌ పులివర్తి నానీ, కాంగ్రెస్‌ అభ్యర్థి శ్రీనివాసులు అలియాస్‌ వాసు నామినేషన్లు వేశారు. సత్యవేడు నుంచీ టీడీపీ అభ్యర్థి కోనేటి ఆదిమూలం, కాంగ్రెస్‌ అభ్యర్థి బాలగురవం బాబు , సూళ్ళూరుపేట నుంచీ వైసీపీ అభ్యర్థి కిలివేటి సంజీవయ్య ,గూడూరు నుంచీ టీడీపీ అభ్యర్థి పాశం సునీల్‌ కుమార్‌, కాంగ్రెస్‌ అభ్యర్థి చిల్లకూరు వేమయ్య,వెంకటగిరి నుంచీ కాంగ్రెస్‌ అభ్యర్థి పంటా శ్రీనివాసులురెడ్డి నామినేషన్లు దాఖలు చేశారు.

ఇతర పార్టీలు, స్వతంత్రుల తరఫున...

తిరుపతి పార్లమెంటుకు వైసీపీ అభ్యర్థి మద్దిల గురుమూర్తి సతీమణి నవ్య కిరణ్‌ వైసీపీ డమ్మీ అభ్యర్థిగా నామినేషన్‌ వేశారు.జై హిందుస్థాన్‌ పార్టీ తరపున అక్కిలిగుంట మధు, జనతా కాంగ్రెస్‌ పార్టీ తరపున ఉమాదేవి నామినేషన్లు సమర్పించారు.తిరుపతి అసెంబ్లీకి బీఎస్పీ తరపున జే.వేణుగోపాలరాజు, జై హిందూస్థాన్‌ పార్టీ తరపున ఎం.నీలకంఠ, ఇండిపెండెంట్లుగా అక్కిపల్లి మునికృష్ణయ్య, బృంగి నవీన్‌ వున్నారు. చంద్రగిరికి పది మంది నామినేషన్లు వేయగా వారిలో నవ భారత నిర్మాణ సేవా పార్టీ తరపున పి.విశ్వనాధరెడ్డి, టీడీపీ డమ్మీ అభ్యర్థిగా కె.గానసుధ అలియాస్‌ పులివర్తి సుధారెడ్డి, జై హిందూస్థాన్‌ పార్టీ నుంచీ ఎం.నీలకంఠ, జాతీయ చేతివృత్తుల ఐక్య వేదిక పార్టీ నుంచీ ఎల్‌.ప్రసాద్‌, జై భారత్‌ నేషనల్‌ పార్టీ నుంచీ తురక అమరనాధ్‌, జనతా కాంగ్రెస్‌ పార్టీ నుంచీ ఎం.ఉమాదేవి, ఇండిపెండెంట్లుగా కె.రాము, కె.సాయిచంద్రిక వున్నారు. సత్యవేడుకు నలుగురు నామినేషన్లు దాఖలు చేయగా వారిలో ఇండిపెండెంట్లు వేంపల్లి కృష్ణారావు, సి.సుప్రియ వున్నారు. శ్రీకాళహస్తికి ఆరుగురు నామినేషన్లు వేయగా అందులో బీఎస్పీ తరపున కుంట్రపాకు సురేంద్రబాబు, కుంట్రపాకు మునీశ్వర్‌, పిరమిడ్‌ పార్టీ ఆఫ్‌ ఇండియా తరపున అక్కిరాల పావని, జై భారత్‌ నేషనల్‌ పార్టీ నుంచీ రొమ్మాల నిరంజన్‌రెడ్డి, ఇండిపెండెంట్లుగా పి.నాగరాజనాయుడు,వి.రమేష్‌ వున్నారు. సూళ్ళూరుపేటలో ఐదుగురు నామినేషన్లు ఫైల్‌ చేయగా లిబరేషన్‌ కాంగ్రెస్‌ పార్టీ తరపున కందాటి రజనీకాంత్‌, వైసీపీ డమ్మీ అభ్యర్థిగా కిలివేటి సుభాషిణి, బీఎస్పీ తరపున తొప్పాని రమణయ్య, ఇండిపెండెంటుగా నిడిగుంట అరుణ నామినేషన్లు సమర్పించారు. గూడూరులో టీడీపీ డమ్మీ అభ్యర్థులుగా పాశం జశ్వంత్‌ కుమార్‌, గోనె సంధ్యారాణి, పాశం సురేష్‌ కుమార్‌, పిరమిడ్‌ పార్టీ తరపున డి.పోలమ్మ, ఇండిపెండెంటుగా కమతం కామాక్షి నామినేషన్లు సమర్పించారు.

Updated Date - Apr 23 , 2024 | 12:32 AM