Share News

సరిహద్దు చెక్‌పోస్టు వద్ద 4 కిలోల బంగారం పట్టివేత

ABN , Publish Date - Mar 06 , 2024 | 01:06 AM

నగరి మండలం తడుకుపేటలోని సరిహద్దు చెక్‌పోస్టు వద్ద మంగళవారం ఉదయం నాలుగు కిలోల బంగారం పట్టుకున్నట్లు సీఐ సురేష్‌ తెలిపారు

సరిహద్దు చెక్‌పోస్టు వద్ద 4 కిలోల బంగారం పట్టివేత

నగరి, మార్చి 5: నగరి మండలం తడుకుపేటలోని సరిహద్దు చెక్‌పోస్టు వద్ద మంగళవారం ఉదయం నాలుగు కిలోల బంగారం పట్టుకున్నట్లు సీఐ సురేష్‌ తెలిపారు. ఎన్నికల నేపథ్యంలో తమిళనాడు సరిహద్దున ఏర్పాటు చేసిన చెక్‌పోస్టు వద్ద రోజువారీ వాహనాల తనిఖీలు చేపడుతున్నారు. ఈ క్రమంలో చెన్నై నుంచి తిరుపతికి వెళుతున్న ఓ వాహనంలో బంగారం పట్టుబడినట్లు సీఐ చెప్పారు. బంగారాన్ని సీజ్‌చేసి పోలీసుల అదుపులో ఉంచినట్లు తెలిపారు. ఓ నగల దుకాణం వారికి చెందినట్లుగా బిల్లులు ఉన్నాయని, కానీ లీగల్‌ తనిఖీకి బుధవారం పంపిస్తామన్నారు. కరెక్టుగా బిల్లుల ప్రకారం ఉందని తేలితే వారికి బంగారాన్ని అప్పగిస్తామన్నారు.

Updated Date - Mar 06 , 2024 | 01:06 AM