Share News

3500 టన్నుల రాగులు వెనక్కి

ABN , Publish Date - Jan 30 , 2024 | 11:53 PM

నెలల తరబడి మండల స్థాయి స్టాక్‌ పాయింట్లలో నిల్వ ఉన్న 3500 టన్నుల రాగులను ఎట్టకేలకు జిల్లా యంత్రాంగం వెనక్కి పంపింది.

3500 టన్నుల రాగులు వెనక్కి

కార్డుదారుల అనాసక్తి.. మార్చి నుంచి రాగిపిండి ఇస్తారంట

చిత్తూరు కలెక్టరేట్‌, జనవరి 30: నెలల తరబడి మండల స్థాయి స్టాక్‌ పాయింట్లలో నిల్వ ఉన్న 3500 టన్నుల రాగులను ఎట్టకేలకు జిల్లా యంత్రాంగం వెనక్కి పంపింది. ఉమ్మడి చిత్తూరు జిల్లాలో కొన్ని మండలాలు మినహా మెజార్టీ మండలాల్లో రాగుల వినియోగం తక్కువే. గతేడాది జూలై నుంచి బియ్యం స్థానంలో ప్రతి కార్డుదారుకు మూడు కిలోల రాగులను పంపిణీ చేశారు. నాసిరకంగా ఉన్నాయంటూ వీటిని తీసుకునేందుకు కార్డులు అనాసక్తి చూపారు. దాంతో రాగులు ఎం.ఎల్‌. పాయింట్లలో నెలలతరబడి నిల్వ ఉండిపోయాయి. ఎండలకు, వర్షానికి పాడైపోయాయి. రెండు నెలల క్రితం జేసీ శ్రీనివాసులు బియ్యం స్థానంలో రాగులును తీసుకుని పంపిణీ చేయాలని డీలర్లపై ఒత్తిడి తెచ్చినా తీసుకెళ్లలేదు. కాగా, నిల్వవున్న రాగులును మిల్లింగ్‌చేసి మార్చి నుంచి కేజీ ప్యాకెట్ల రూపంలో ఉచితంగా రాగిపిండి పంపిణీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. దాంతో అధికారుల సూచన మేరకు నిల్వవున్న రాగులను వారం కిందట సమీప మిల్లులకు పంపించారు.

Updated Date - Jan 30 , 2024 | 11:53 PM