వైఎస్సార్ చేయూతకు రూ.195.42 కోట్లు
ABN , Publish Date - Mar 08 , 2024 | 12:51 AM
వైఎసార్ చేయూత పథకం కింద 1,04,226 మందికి ప్రభుత్వం రూ.195.42 కోట్లను విడుదల చేసినట్లు జేసీ శ్రీనివాసులు తెలిపారు.
చిత్తూరు, మార్చి 7: వైఎసార్ చేయూత పథకం కింద 1,04,226 మందికి ప్రభుత్వం రూ.195.42 కోట్లను విడుదల చేసినట్లు జేసీ శ్రీనివాసులు తెలిపారు. గురువారం అనకాపల్లి నుంచి సీఎం జగన్ బటన్ నొక్కి ప్రారంభించారు. చిత్తూరులో లబ్ధిదారులకు జేసీ, ఇతర ప్రజా ప్రతినిధులు మెగా చెక్కు అందించారు. వీవోలు, డ్వాక్రా మహిళలు తదితరులు పాల్గొన్నారు.