Share News

జగనన్నతోడు లబ్ధిదారులకు రూ.18.21కోట్లు

ABN , Publish Date - Jan 12 , 2024 | 12:30 AM

జగనన్న తోడు పథకంలో భాగంగా తిరుపతి జిల్లాలోని 16,541మంది లబ్ధిదారులకు రూ.17.50కోట్లు జమ చేసినట్లు కలెక్టర్‌ వెంకటరమణారెడ్డి తెలిపారు.

జగనన్నతోడు లబ్ధిదారులకు రూ.18.21కోట్లు
తిరుపతిలో నమూనా చెక్కు అందుకుంటున్న లబ్ధిదారులు

తిరుపతి(కలెక్టరేట్‌), జనవరి 11 : జగనన్న తోడు పథకంలో భాగంగా చిరు వ్యాపారుల ఆర్థిక స్వావలంబన కోసం నాలుగో ఏడాది ఎనిమిదవ విడత కింద జిల్లాలోని 16,541మంది లబ్ధిదారులకు రూ.17.50కోట్లు జమ చేసినట్లు కలెక్టర్‌ వెంకటరమణారెడ్డి తెలిపారు.గతంలో రుణాలు తీసుకున్న 30,782మంది చిరు వ్యాపారులకు సుమారు రూ.70.71లక్షలు వడ్డీ రీయింబర్స్‌మెంట్‌ లభిస్తుందని తెలిపారు. గురువారం కలెక్టరేట్‌లో ఎమ్మెల్సీ సిపాయి సుబ్రహ్మణ్యం, సత్యవేడు ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలంతో కలిసి లబ్ధిదారులకు రూ.18.21కోట్ల మెగా చెక్కును అందజేశారు.డీఆర్డీఏ, మెప్మా, అధికారులు, మహిళా సంఘాల సభ్యులు పాల్గొన్నారు.

Updated Date - Jan 12 , 2024 | 12:31 AM