Share News

కలెక్టరేట్‌ స్పందనకు 182 అర్జీలు

ABN , Publish Date - Feb 20 , 2024 | 12:35 AM

కలెక్టరేట్‌లో సోమవారం నిర్వహించిన స్పందనకు వచ్చిన అర్జీలను వెంటనే పరిష్కరించాలని డీఆర్వో పుల్లయ్య ఆదేశించారు.

కలెక్టరేట్‌ స్పందనకు 182 అర్జీలు
అర్జీదారులతో మాట్లాడుతున్న డీఆర్వో పుల్లయ్య

కలెక్టరేట్‌లో సోమవారం నిర్వహించిన స్పందనకు వచ్చిన అర్జీలను వెంటనే పరిష్కరించాలని డీఆర్వో పుల్లయ్య ఆదేశించారు. కలెక్టరేట్‌లో నిర్వహించిన స్పందనలో డీఆర్వోతో పాటు డ్వామా పీడీ రాజశేఖర్‌, జిల్లా మైనార్టీ శాఖ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ ప్రభాకర్‌రెడ్డిలతో కలిసి వినతిపత్రాలను స్వీకరించారు. అధికారుల దృష్టికి మొత్తం 182 అర్జీల రాగా శాఖల వారీగా వాటి వివరాలు.. రెవెన్యూశాఖకు 157, రేషన్‌కార్డులు, పెన్షన్లకు 10, మిగిలిన శాఖలకు 14 అర్జీలు అందాయి. ఈ కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. ఎండలు పెరుగుతున్న దృష్ట్యా అర్జీదారుల సంఖ్య కూడా గణనీయంగా తగ్గింది.

పోలీసు స్పందనకు 19 అర్జీలు

జిల్లా పోలీసు ఏఆర్‌ కార్యాలయంలో సోమవారం స్పందన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బాధితుల నుంచి ఏఎస్పీ అరీఫుల్లా వినతిపత్రాలను స్వీకరించారు. వారి సమస్యలను విని పరిష్కారానికి నిర్ణీత సమయంలోగా చర్యలు చేపడతామని హామీ ఇచ్చారు. అధికారుల దృష్టికి మొత్తం 19 అర్జీలు అందగా, వాటి వివరాలు.. భూ తగాదాల కింద 9, కుటుంబ తగాదాల కింద 3, వేధింపులు 2, డబ్బు తగాదాలు 2, దారి తగాదాలు 2 వంతున అర్జీలు అందాయి.

Updated Date - Feb 20 , 2024 | 12:35 AM