ఇంటర్ పరీక్షకు 13,329 మంది హాజరు
ABN , Publish Date - Mar 06 , 2024 | 12:51 AM
జిల్లాలో మంగళవారం జరిగిన ఇంటర్ ద్వితీయ సంవత్సరం ఇంగ్లీష్ పరీక్షకు 13,329 మంది విద్యార్థులు హాజరైనట్లు డీవీఈవో సయ్యద్ మౌల తెలిపారు.

చిత్తూరు (సెంట్రల్), మార్చి 5: జిల్లాలో మంగళవారం జరిగిన ఇంటర్ ద్వితీయ సంవత్సరం ఇంగ్లీష్ పరీక్షకు 13,329 మంది విద్యార్థులు హాజరైనట్లు డీవీఈవో సయ్యద్ మౌల తెలిపారు. 14,012 మంది విద్యార్థులకు గాను 13,329 మంది హాజరు కాగా, 683 మంది గైర్హాజరైనట్లు ఆయన పేర్కొన్నారు. డీవీఈవో నాలుగు, జిల్లా కమిటీ సభ్యులు 10, స్క్వాడ్ ఎనిమిది సెంటర్లను పరిశీలించారు. కాగా మంగళవారం టెట్ జరగలేదు.