Chintapalli : మన్యం గజగజ
ABN , Publish Date - Nov 28 , 2024 | 05:15 AM
మన్యంలో చలి ప్రజలను వణికిస్తున్నది. ఉత్తరాది నుంచి వీస్తున్న శీతల గాలుల ప్రభావం వల్ల గిరిజన ప్రాంతంలో క్రమంగా ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయి.

చింతపల్లి, నవంబరు 27(ఆంధ్రజ్యోతి): మన్యంలో చలి ప్రజలను వణికిస్తున్నది. ఉత్తరాది నుంచి వీస్తున్న శీతల గాలుల ప్రభావం వల్ల గిరిజన ప్రాంతంలో క్రమంగా ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయి. బుధవారం డుంబ్రిగుడలో 8.2, జి.మాడుగులలో 8.7, హుకుంపేటలో 10, చింతపల్లిలో 11.5, పాడేరు, పెదబయలులో 12, అనంతగిరిలో 13, అరకులోయలో 13.2, కొయ్యూరులో 15.7 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదైనట్టు చింతపల్లి ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం ఏడీఆర్, వాతావరణ విభాగం నోడల్ అధికారి డాక్టర్ ఆళ్ల అప్పలస్వామి తెలిపారు. మంచు కూడా అధికంగా కురుస్తుంది. ఉదయం తొమ్మిది గంటల వరకూ సూర్యుడు కనిపించడం లేదు. ప్రధాన కూడళ్లలో సాయంత్రం ఆరు గంటల నుంచే జనసంచారం కనిపించడం లేదు.