Share News

Chandrababu: ప్రత్యేక హెలికాప్టర్ లో కనిగిరి బయల్దేరిన చంద్రబాబు

ABN , Publish Date - Jan 05 , 2024 | 03:27 PM

మరి కొద్ది సేపట్లో ఉండవల్లి నివాసం నుంచి టీడీపీ అధినేత, ఏపీ మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ప్రకాశం జిల్లా కనిగిరికి బయలుదేరి వెళ్లనున్నారు. ప్రకాశం జిల్లా కనిగిరిలో 'రా కదలిరా తెలుగుదేశం' తొలి సభ జరగనుంది

Chandrababu: ప్రత్యేక హెలికాప్టర్ లో కనిగిరి బయల్దేరిన చంద్రబాబు

అమరావతి: మరి కొద్ది సేపట్లో ఉండవల్లి నివాసం నుంచి టీడీపీ అధినేత, ఏపీ మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ప్రకాశం జిల్లా కనిగిరికి బయలుదేరి వెళ్లనున్నారు. ప్రకాశం జిల్లా కనిగిరిలో 'రా కదలిరా తెలుగుదేశం' తొలి సభ జరగనుంది. ఈనెల 29 వరకు వరుసగా సభల కోసం చంద్రబాబు ప్రత్యేక పెళ్లికాప్టర్ ను ఉపయోగించనున్నారు. 12 రోజులు 22 సభల్లో చంద్రబాబు పాల్గొనేలా కార్యచరణ రూపొందించారు. రోజుకు రెండు సభల్లో పాల్గొనేలా షెడ్యూల్ తయారు చేశారు. కనిగిరి వెళ్లేందుకు చంద్రబాబు ఇంటి వద్దకు ప్రత్యేక హెలికాప్టర్ చేరుకుంది.

Updated Date - Jan 05 , 2024 | 03:44 PM