Share News

AP News: సార్వత్రిక ఎన్నికల సన్నద్ధతపై ఏపీకి కేంద్ర ఎన్నికల బృందం

ABN , Publish Date - Jan 03 , 2024 | 08:30 AM

సార్వత్రిక ఎన్నికల సన్నద్ధతపై ఈ నెల 9,10 తేదీల్లో రాష్ట్రానికి కేంద్ర ఎన్నికల కమిషన్ బృందం చేరుకోనుంది. సీఈసీ ఆధ్వర్యంలో అధికారుల బృందం ఏపీకి రానుంది. ఓటర్ల జాబితాలో లోపాలు, జాబితా సిద్ధం కోసం అధికారులు చేస్తున్న ప్రయత్నాలు, ఫిర్యాదులపై విచారణను అధికారులు పరిశీలన చేయనున్నారు.

AP News: సార్వత్రిక ఎన్నికల సన్నద్ధతపై ఏపీకి కేంద్ర ఎన్నికల బృందం

అమరావతి: సార్వత్రిక ఎన్నికల సన్నద్ధతపై ఈ నెల 9,10 తేదీల్లో కేంద్ర ఎన్నికల కమిషన్ బృందం ఆంధ్రప్రదేశ్‌లో పర్యటించనుంది. సీఈసీ ఆధ్వర్యంలో అధికారుల బృందం ఏపీకి రానుంది. ఓటర్ల జాబితాలో లోపాలు, జాబితా సిద్ధం కోసం అధికారులు చేస్తున్న ప్రయత్నాలు, ఫిర్యాదులపై విచారణను అధికారులు పరిశీలన చేయనున్నారు.

మద్యం అక్రమ రవాణా, డబ్బు చేరవేత వంటి కార్యకలాపాల నివారణకు చెక్ పోస్ట్ ఏర్పాటు వంటి ఇతర అంశాలపై అధికారులతో సమీక్ష నిర్వహించనున్నారు. క్షేత్ర స్థాయి పరిశీలనకు బృందం వెళ్లనుంది. జిల్లా కలెక్టర్లు, ఎస్పీలతో కూడా భేటీ కానుంది. రాష్ట్ర సీఈఓ, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, డీజీపీ, ఎన్నికలతో సంబంధం ఉన్న ఇతర అధికారులతో కూడా భేటీకి ఏర్పాట్లు చేయాలని రాష్ట్ర అధికారులకు ఆదేశాలు అందాయి.

Updated Date - Jan 03 , 2024 | 10:44 AM