Share News

APSRTC Bus : త్రుటిలో తప్పిన పెను ప్రమాదం

ABN , Publish Date - Nov 25 , 2024 | 04:04 AM

ప్రయాణికులతో వెళ్తున్న ఆర్టీసీ బస్సు పంట కాల్వలోకి బోల్తా కొట్టిన ఘటన పశ్చిమ గోదావరి జిల్లా పెంటపాడు మండలం ముదునూరు గ్రామ సమీపంలో ఆదివారం సాయంత్రం జరిగింది.

APSRTC Bus : త్రుటిలో తప్పిన పెను ప్రమాదం

  • పంట కాల్వలోకి ఆర్టీసీ బస్సు బోల్తా

పెంటపాడు, నవంబరు 24 (ఆంధ్రజ్యోతి): ప్రయాణికులతో వెళ్తున్న ఆర్టీసీ బస్సు పంట కాల్వలోకి బోల్తా కొట్టిన ఘటన పశ్చిమ గోదావరి జిల్లా పెంటపాడు మండలం ముదునూరు గ్రామ సమీపంలో ఆదివారం సాయంత్రం జరిగింది. తాడేపల్లిగూడెం డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు భీమవరం బయల్దేరింది. పెంటపాడు దాటిన తరువాత ముదునూరు సమీపంలో బస్సు స్టీరింగ్‌ వదిలేయడంతో పక్కనే ఉన్న పంట కాల్వలోకి దూసుకెళ్లి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో బస్సులో ప్రయాణిస్తున్న సుమారు 25 మంది ప్రయాణికులు క్షేమంగా ఉన్నారని అధికారులు తెలిపారు. అయితే.. బస్సు కండక్టర్‌ శాంతికుమారికి ఎదురుగా ఉన్న అదనపు టైరు కాళ్ల మీద పడడంతో గాయాలయ్యాయి. ఆమెను చికిత్స నిమిత్తం తాడేపల్లిగూడెం ఏరియా ఆసుపత్రికి తరలించారు. సంఘటన స్థలాన్ని ఆర్టీసీ డీఎం వై.సత్యనారాయణమూర్తి, ఎస్‌ఐ స్వామి పరిశీలించారు.

Updated Date - Nov 25 , 2024 | 04:04 AM