Share News

AP Cabinet: ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్‌కు లాంఛనంగా ఆమోద ముద్ర

ABN , Publish Date - Feb 07 , 2024 | 09:44 AM

Andhrapradesh: ఓట్‌ ఆన్ అకౌంట్ బడ్జెట్‌కు ఏపీ కేబినెట్ లాంఛనంగా ఆమోద ముద్ర వేసింది. ఈరోజు ఉదయం ఏపీ కేబినెట్ సమావేశమైంది. ఈ సందర్భంగా ఓట్‌ ఆన్ అకౌంట్ బడ్జెట్‌కు మంత్రి వర్గం ఆమోదం తెలిపింది.

AP Cabinet: ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్‌కు లాంఛనంగా ఆమోద ముద్ర

అమరావతి, ఫిబ్రవరి 7: ఓట్‌ ఆన్ అకౌంట్ బడ్జెట్‌కు ఏపీ కేబినెట్ లాంఛనంగా ఆమోద ముద్ర వేసింది. ఈరోజు (బుధవారం) ఉదయం ఏపీ కేబినెట్ సమావేశమైంది. ఈ సందర్భంగా ఓట్‌ ఆన్ అకౌంట్ బడ్జెట్‌కు మంత్రి వర్గం ఆమోదం తెలిపింది. అంతకుముందు మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి (Minister Buggana Rajendranath Reddy) తన ఛాంబర్లో ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్‌కు పూజాలు నిర్వహించారు. ఈరోజు ఉదయం 11 గంటలకు శాసనసభలో ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్‌ను మంత్రి బుగ్గన ప్రవేశపెట్టనున్నారు. శాసనమండలిలో పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్‌నాథ్‌ ఓట్ ఆన్ అకౌంట్‌ బడ్జెట్‌ను ప్రవేశపెడతారు. రాబోయే ఆర్థిక సంవత్సరానికి రూ.2.86 లక్షల కోట్ల బడ్జెట్‌ను అంచనా వేయగా, ప్రస్తుతం ఓట్ ఆన్ అకౌంట్‌ కింద 4 నెలలకు రూ.95 వేల కోట్ల నుంచి రూ.96 వేల కోట్ల వరకు బడ్జెట్‌ను ప్రతిపాదించనున్నారు.

మరిన్ని ఏపీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి...

Updated Date - Feb 07 , 2024 | 09:49 AM