Share News

చేయి వేయాలంటే నన్ను దాటాలి

ABN , Publish Date - Jan 08 , 2024 | 11:54 PM

ఎంతో ప్రశాంతంగా ఉండే పెనుకొండలో మంత్రి ఉష శ్రీచరణ్‌ రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారు. వైసీపీ కార్యకర్తలు, నాయకులపై చేయి వేయాలంటే మొదట తనను దాటుకుని వెళ్లాలని టీడీపీ వారిని రెచ్చగొట్టారు.

చేయి వేయాలంటే నన్ను దాటాలి
బస్సు దిగి పెనుకొండ పట్టణంలోకి నడిచి వస్తున్న ప్రయాణికులు

మంత్రి ఉషశ్రీచణ్‌ రెచ్చగొట్టే వ్యాఖ్యలు

పెనుకొండ రూరల్‌, జనవరి 8: ఎంతో ప్రశాంతంగా ఉండే పెనుకొండలో మంత్రి ఉష శ్రీచరణ్‌ రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారు. వైసీపీ కార్యకర్తలు, నాయకులపై చేయి వేయాలంటే మొదట తనను దాటుకుని వెళ్లాలని టీడీపీ వారిని రెచ్చగొట్టారు. పెనుకొండ నియోజకవర్గ సమన్వయకర్తగా మంత్రి ఉషశ్రీచరణ్‌ను ఇటీవ లే వైసీపీ నియమించింది. ఈ నేపథ్యంలో పెను కొండలోని ఎమ్మెల్యే శంకర్‌నారాయణ ఇంటివద్ద వైసీపీ నాయకులు, కార్యకర్తలతో మంత్రి సోమవారం ఆత్మీయ సమావే శాన్ని నిర్వహించారు. ‘యుద్ధం మొదలైంది.. శంఖం పూరించండి’ అని మంత్రి తమ పార్టీ కార్యకర్తలనుద్దేశించి అన్నారు. టీడీపీ వారు వైసీపీ నాయకులు, కార్యకర్తలపై చేయి వేయాలంటే మొదట తనను టచచేసి వె ళ్లాలన్నారు. ప్రతిపక్ష టీడీపీ వైపు నుంచి ఎలాంటి వివాదాస్పద వ్యాఖ్యలు, రెచ్చగొట్టే మాటలు లేకపోయినా.. మంత్రి ఇలా నిప్పు రాజేసే మాటలు మా ట్లాడటం విమర్శలకు తావిచ్చింది. ఆమె రాకతో తమ ప్రశాంతతకు ముప్పు వాటిల్లేలా ఉందని పెనుకొండ ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

మంత్రి ఆర్భాటంతో ప్రయాణికులకు ఇబ్బందులు

పెనుకొండలోని మడకశిర రహదారిలో ఉన్న ఎమ్మెల్యే శంకర్‌నారాయణ ఇంటి వద్ద మంత్రి సమావేశాన్ని నిర్వహిం చారు. దీంతో ఆ మార్గంలో వాహనాలు ఎక్కడికక్కడ నిలిచిపో యాయి. ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొ న్నారు. మంత్రి సమావేశంలో మధ్యాహ్నం 12 గంటలకు మొదలైంది. సమావేశానికి వచ్చిన అధికార పార్టీవారు రహదారిలో వాహనాలు ఎక్కడబడితే అక్కడ పార్కింగ్‌ చేశారు. దీనికితోడు మంత్రి పర్యటన ముగిసేవరకు పోలీసులు ట్రాఫిక్‌ ఆంక్షలు విధించారు. దీంతో పెనుకొండ-మడకశిర మార్గంలో ట్రాఫిక్‌ గంటల తరబడి స్తంభించింది. మడకశిర రహదారిలో రెండు కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. చేసేది లేక ఆర్టీసీ ప్రయాణికులు బస్సులు దిగి నడుచుకుంటూ పట్టణంలోకి వచ్చారు. ఆటోలు వెళ్లేందుకూ వీలు కాకపోవడంతో మహిళలు, చిన్నారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు.

Updated Date - Jan 08 , 2024 | 11:54 PM