Share News

VOTERS: ఓట్లు వేయరా ... తడాఖా చూపుతాం..!

ABN , Publish Date - Jun 17 , 2024 | 12:03 AM

వైసీపీని ప్రజలు ఛీ కొట్టినా... ఆ పార్టీ నాయకుల తీరు మారలేదు. శింగనమల నియోజకవర్గంలో అత్యధికంగా గ్రామ పంచాయతీల్లో వైసీపీ మద్దతు సర్పంచులే ఉన్నారు. సార్వత్రిక ఎన్నికలలో ఆ పార్టీ ఓటమి చవి చూసింది. నిఇ్న జీర్ణించుకోలేక కొందరు ఆ పార్టీ సర్పంచులు, గ్రామ నాయకులు ప్రజలపై కక్షసాధిస్తున్నారు.

VOTERS: ఓట్లు వేయరా ... తడాఖా చూపుతాం..!

అల్లాడిపోతున్న గ్రామాల ప్రజలు

జగన మత్తు వీడని గ్రామ కార్యదర్శులు

బోరు మరమ్మతులు చేయించిన టీడీపీ కార్యకర్తలు

బుక్కరాయసముద్రం, జూన 16: వైసీపీని ప్రజలు ఛీ కొట్టినా... ఆ పార్టీ నాయకుల తీరు మారలేదు. శింగనమల నియోజకవర్గంలో అత్యధికంగా గ్రామ పంచాయతీల్లో వైసీపీ మద్దతు సర్పంచులే ఉన్నారు. సార్వత్రిక ఎన్నికలలో ఆ పార్టీ ఓటమి చవి చూసింది. నిఇ్న జీర్ణించుకోలేక కొందరు ఆ పార్టీ సర్పంచులు, గ్రామ నాయకులు ప్రజలపై కక్షసాధిస్తున్నారు. వైసీపీకి ఓట్లు వేయకుండా టీడీపీకి ఓట్లు వేస్తారా? మా తడఖా ఏంటో చూపిస్తామని సర్పంచలు రెచ్చిపోతున్నారు. ఎన్నికల ఫలితాలు వచ్చిన మరసుటి రోజు నుంచే ప్రజలకు ఇబ్బందులు కలిగే విధంగా వారు వ్యవహరిస్తున్నారు. గ్రామాలకు తాగునీరు రాకుండా బంద్‌ చేయిస్తున్నారు. వీటితో గ్రామాల్లో కార్మికులు కాలువలు శుభ్రం చేయకుండా, చేత్త సేకరణ తదితర పనులను తాత్కలికంగా నిలిపివేయించారు. శింగనమల నియోజకవర్గంలో పలు గ్రామ పంచాయతీలలో ప్రజలపై కక్షసాధింపు చర్యలుకు దిగుతున్నా... గ్రా మ సెక్రటరీలు మౌనంగా ఉండటం విశేషం. ప్రభుత్వం మారినా పలు గ్రామాల్లో కార్యదర్శులు వైసీపీ మత్తులోనే ఉన్నారని ప్రజలు ఆరోపిస్తున్నారు.


బోరును మరమ్మతు చేయించిన టీడీపీ కార్యకర్తలు

బీకేఎ్‌సలోని జనచైతన్య కాలనీలో తాగునీటి సమస్య తీవ్రంగా ఉందని, పలు సార్లు ప్రజలు పంచాయతీ కార్యాలయంలో ఫిర్యాదు చేశారు. అయినా అధికారులు పట్టించుకోలేదు. కాలనీలో అత్యధికంగా ముస్లిం మైనార్టీ వర్గాలు నివసిస్తున్నారు. సోమవారం బక్రీద్‌ పండుగ నేపథ్యంలో ఇబ్బందుపడుతున్నారని వెంటనే మరమ్మతులు చేయాలని అధికారులును వేడుకున్నారు. ఎన్నికల్లో ఓట్లు వేయలేదని ఉద్దేశంతోనే తాగునీటి బోరు మరమ్మతు చేయలేదని అంటున్నారు. టీడీపీ కార్యకర్తలు రంగమ్మ, రఫీ, వలీ సొంత డబ్బు పెట్టి తాగునీటి బోరుకు మరమ్మతు చేయించి నీటిని సరఫరా చేయించారు. వీటితో పాటు పుట్లూరు మండల కేంద్రంలో గతంలో తాగునీటి సమస్య నెలకొంది. గ్రామ పంచాయతీ సర్పంచ వైసీపీకి చెందినవాడు కావడంతో అక్కడ ఉన్న స్థానిక నాయకులు తాగునీటి ట్యాంకర్ల ద్వారా ప్రజలకు గతంలో నీటిని అందించేవారు. ఎన్నికల ఫలితాలు అనంతరం ట్యాంకర్ల ద్వారా ప్రజలకు నీటిని అందించడం లేదు. స్వయంగా టీడీపీ నాయకుడు పుల్లారెడ్డి సొంత డబ్బుతో ట్యాంకర్ల ద్వారా ప్రజలకు నీటిని అందిస్తున్నారు.


మేజర్‌ గ్రామ పంచాయతీలో తాగునీరు బంద్‌

జిల్లా కేంద్రానికి కూతవేటు దూరంలో ఉన్న బుక్కరాయసముద్రం మేజర్‌ గ్రామ పంచాయుయతీలో ఎన్నికల ఫలితాలు వెలువడిన వెంటనే తాగునీరు బంద్‌ చేయించారు. దీంతో గ్రామంలోని ప్రజలు తాగునీటి కోసం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పంచాయతీలో 4 వేల ఓట్లు టీడీపీకి మెజార్టీ రావడంతో వైసీపీ నాయకులు జీర్ణించుకోలేక ఈ దుశ్చర్యకు దిగినట్లు ప్రజలు అంటున్నారు. సాధారణంగా ఒకటి రెండు చోట్ల తాగునీటి సమస్య రావడం సహజం. ఏకంగా 8 నుంచి 9 కాలనీలల్లో సమస్య ఉందనే విధంగా చిత్రీకరించారు. పంచాయతీలో 40 వేల జనభా ఉంది. ప్రస్తుతం కొళాయిల్లో నీరు రాకపోవడంతో ప్రజలు అల్లాడిపోతున్నారు. నీటి సమస్య తట్టుకోలేక గ్రామ సచివాలయం వద్ద మహిళలు ఽధర్నా చేపట్టారు. అయినా అధికారులలో ఎలాంటి స్పందన రాలేదు. వీటితో పాటు పంచాయతీ కార్మికులు డ్రైనేజీలు, రోడ్లు శుభ్రం చేయడానికి రావడం లేదని ప్రజలు ఆరోపిస్తున్నారు. ఎన్నికల ఫలితాలు ముందు నీరు వచ్చేదని, ప్రస్తుతం రాకుండా చేశారని విమర్శిస్తున్నారు. నియోజకవర్గంలో వైసీపీ గ్రామ సర్పంచలు ఉన్న గ్రామాల్లో తాగునీటి సమస్య వచ్చినా, ఇతర సమస్యలు వచ్చినా అధికారులు, సర్పంచులు పట్టించుకోవడం లేదన్న విమర్శలు వస్తున్నాయి.

Updated Date - Jun 17 , 2024 | 12:03 AM