Share News

ఎస్సీ,ఎస్టీలను కూలీలుగా మార్చిన వైసీపీ

ABN , Publish Date - Apr 21 , 2024 | 09:08 AM

‘నా ఎస్సీలు.. నా ఎస్టీలు.. వారి అభివృద్ధే నా ధ్యేయం... వారు ఆర్థికంగా నిలదొక్కుకునేందుకు శాయశక్తులా కృషి చేస్తా’ అంటూ ముఖ్యమంత్రి జగనరెడ్డి బహిరంగ సభల్లో అలవికాని ప్రేమ ఒలకబోస్తూ ఉంటారు. క్షేత్రస్థాయిలో పరిశీలిస్తే ఎస్సీ,ఎస్టీల అభివృద్ధి ఎక్కడ జరిగిందో... ఎలా జరిగిందో అర్థంకాని విధంగా మారింది. గ్రామీణ ప్రాంతాల్లోని పేద ఎస్సీ,ఎస్టీలు స్వయం ఉపాధితో ఆర్థికంగా అభివృద్ధి చెందాలనే ఉద్దేశ్యంతో గత ప్రభుత్వాలు ల్యాండ్‌ పర్చేసింగ్‌ స్కీమ్‌ను ప్రవేశపెట్టాయి.

ఎస్సీ,ఎస్టీలను కూలీలుగా మార్చిన వైసీపీ
SC CORPORATION

భూమి కొనుగోలు పథకానికి మంగళం

ఐదేళ్లలో ఒక్క ఎకరా కొనుగోలు చేయని దుస్థితి

టీడీపీ హయాంలో ఎస్సీలకు

రూ. 23.31 కోట్లతో 799 ఎకరాలు

ఎస్టీలకు రూ. 62.72 లక్షలతో

49.44 ఎకరాల కొనుగోలు

అనంతపురం ప్రెస్‌క్లబ్‌, ఏప్రిల్‌ 20 : ‘నా ఎస్సీలు.. నా ఎస్టీలు.. వారి అభివృద్ధే నా ధ్యేయం... వారు ఆర్థికంగా నిలదొక్కుకునేందుకు శాయశక్తులా కృషి చేస్తా’ అంటూ ముఖ్యమంత్రి జగనరెడ్డి బహిరంగ సభల్లో అలవికాని ప్రేమ ఒలకబోస్తూ ఉంటారు. క్షేత్రస్థాయిలో పరిశీలిస్తే ఎస్సీ,ఎస్టీల అభివృద్ధి ఎక్కడ జరిగిందో... ఎలా జరిగిందో అర్థంకాని విధంగా మారింది. గ్రామీణ ప్రాంతాల్లోని పేద ఎస్సీ,ఎస్టీలు స్వయం ఉపాధితో ఆర్థికంగా అభివృద్ధి చెందాలనే ఉద్దేశ్యంతో గత ప్రభుత్వాలు ల్యాండ్‌ పర్చేసింగ్‌ స్కీమ్‌ను ప్రవేశపెట్టాయి. అందుకనుగుణంగా భూములను కేటాయిస్తూ వచ్చాయి. గత టీ డీపీ ప్రభుత్వం ఎస్సీ,ఎస్టీల కోసం భూములు కొనుగోలు చేసి వారికందించింది. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ఆ స్కీమ్‌ను తొలగించి ఆ వర్గాల ప్రజల నోట్లో మట్టి కొట్టింది. వైసీపీ ఐ దేళ్ల పాలనలో ఒక్క ఎకరా కొనుగోలు చేయలేదంటే ఎస్సీ,ఎస్టీల పట్ల ప్రభుత్వానికి ఏపాటి చిత్తశుద్ధి ఉంటే అర్థమవుతోంది. ఎస్సీ,ఎస్టీలు అగ్రవర్ణాల కిం ద కూలీలుగా ఉండాలనే దురుద్దేశ్యంతోనే తమను ఐదేళ్లుగా వైసీపీ ప్రభుత్వం వ్యవసాయ కూలీలుగా మార్చిందని ఆ వర్గాలు మండిపడుతున్నాయి.


- హిందూపురంఇందుకోసం ఎస్సీ కార్పొరేషన ద్వారా ఒక బృందాన్ని ఏర్పాటు చేసి భూములు లేనినిరుపేద ఎస్సీల జాబితాను సిద్ధం చేసింది. కార్పొరేషన అధికారులు అందించిన నివేదికల మేరకు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 317 మంది లబ్ధిదారులను ఎంపిక చేసింది. జిల్లాలో పలు ప్రాంతాల్లో 799.98 ఎకరాల భూమిని గుర్తించి కొనుగోలు చేసింది. ఆ భూముల కొనుగోలు కోసం రూ. 23.31 కోట్లను ఖర్చు చేసింది. ఎస్టీ వర్గాల్లో వ్యవసాయ భూములు లేని వారి కోసం ల్యాండ్‌ పర్చేసింగ్‌ స్కీమ్‌ కింద రూ. 62.72 లక్షల నిధులను విడుదల చేసింది. ఇందుకోసం జిల్లా వ్యాప్తంగా 22 మందిని ఎంపిక చేశారు. వారి కోసం దాదాపు 49.44 ఎకరాలను కొనుగోలు చేసి అప్పగించారు. ఎస్టీల కోసం వ్యవసాయానికి బోర్లు లేని వారిని 20 మందిని ఎంపిక చేసి డిగ్గింగ్‌ బోర్‌ వెల్స్‌ స్కీమ్‌ కింద 20 మంది లబ్ధిదారులకు రూ. 22.80 లక్షలు ఖర్చు చేసి బోర్లు వేయించింది. బోర్లు ఉండి విద్యుత సౌకర్యం లేని వారి కోసం ఎనర్జిసేషన ఆఫ్‌ ఎస్టీ బోర్‌ వెల్స్‌ పథకం కింద 690 మంది ఎస్టీ లబ్ధిదారులకు రూ. 6.62 కోట్లు ఖర్చుచేసి కరెంటు సౌకర్యాన్ని కల్పించింది. మొత్తం మీద ఎస్సీ,ఎస్టీ పేద ప్రజల కోసం అప్పటి టీడీపీ ప్రభుత్వం ఐదేళ్లలో రూ. 30 కోట్లకుపైగా ఖర్చు చేసింది.


భూములు పంచకపోగా... కబ్జాకు స్కెచ...

టీడీపీ ప్రభుత్వంలో ఎస్సీ,ఎస్టీ వర్గాల కోసం భూములు కొనుగోలు చేసి అందిస్తే... వైసీపీ ప్రభుత్వం ఐదేళ్లలో ఒక్క ఎకరా కొనుగోలు చేయకపోగా... గతంలో లబ్ధిదారులకు అందించిన భూములపై కన్నేసింది. వైసీపీకి చెందిన కొందరు ప్రజాప్రతినిధులు ఎస్సీ,ఎస్టీల చేతుల్లో ఉన్న భూములను కబ్జాకు స్కెచ చేశారు. ప్రధానంగా తాడిపత్రి పరసర ప్రాంతాలు యల్లనూరు, పుట్లూరుతో పాటుమరికొన్ని ప్రాంతాల్లో దాదాపు 160 ఎకరాలకుపైగానే పలువురు రాజకీయ నేతల కబంధ హస్తాల్లో చిక్కుకున్నట్లు తెలుస్తోంది. దీంతో లబ్ధిదారులు ఆ ప్రజాప్రతినిధుల వద్ద తీసుకున్న అప్పును తీర్చలేక... భూములను విడిపించుకోలేక సతమతమవుతున్నారు. ఇలా వైసీపీ ఐదేళ్ల పాలనలో ఎస్సీ,ఎస్టీ ప్రజలకు ఉన్న పథకాలను వర్తింపజేయకపోగా ఉన్నవాటిని లాగేసుకునే ప్రయత్నం చేయడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

Updated Date - Apr 21 , 2024 | 12:44 PM