Share News

వైసీపీకి కాలం చెల్లింది: మాజీమంత్రి పల్లె

ABN , Publish Date - Apr 06 , 2024 | 12:29 AM

ఓబుళదేవరచెరువు, ఏప్రిల్‌ 5: రాష్ట్రంలో వైసీపీకి ఇక కాలం చెల్లిందని, ఆ పార్టీకి చమరగీతం పాడడానికి ప్రజలు సిద్ధం గా ఉన్నారని మాజీమంత్రి పల్లె రఘునాథ రెడ్డి పేర్కొన్నారు.

 వైసీపీకి కాలం చెల్లింది: మాజీమంత్రి పల్లె

- టీడీపీలోకి 40 కుటుంబాల చేరిక

ఓబుళదేవరచెరువు, ఏప్రిల్‌ 5: రాష్ట్రంలో వైసీపీకి ఇక కాలం చెల్లిందని, ఆ పార్టీకి చమరగీతం పాడడానికి ప్రజలు సిద్ధం గా ఉన్నారని మాజీమంత్రి పల్లె రఘునాథ రెడ్డి పేర్కొన్నారు. మండలంలోని డబురువారిపల్లిలో శుక్రవారం జయ హో బీసీ సదస్సు జరిగింది. కార్యక్రమం ప్రారంభానికి ముందు డబ్బురువారిపల్లి పంచాయతీలోని 40 కుటుంబాల వారు నా యకుడు శివారెడ్డి ఆధ్వర్యంలో వైసీపీని వీడి టీడీపీలోకి చేరారు. వారికి పల్లె కండువాలు వేసి పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం మాట్లాడుతూ రాష్ట్రంలో ఐదేళ్ల వైసీపీ పాలనలో ఎలాంటి అభివృద్ధి జరగలేదన్నారు. అవినీతి, అక్రమాలు పెరిగిపోయాయన్నారు. 3,500మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారని తెలిపారు. చంద్రబాబు అఽధికారంలోకి వస్తేనే రాష్ట్రాభివృద్ధి జరుగుతుందన్నారు. బీసీల సంక్షేమం చంద్రబాబుతోనే సాధ్యమన్నారు. కనుక ఎన్నికల్లో టీడీపీ, బీజేపీ, జనసేన కూటమిని గెలిపించాలని కోరారు. అవినీతి వైసీపీని సాగనంపాలని పిలుపునిచ్చారు. అలాగే కొండకమర్ల గ్రామంలోని కొత్త మసీదు వద్ద ముస్లింమైనార్టీలు ఏర్పాటు చేసిన ఇఫ్తార్‌ విందులో పల్లె పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ గతంలో ముస్లింల సంక్షేమానికి చంద్రబాబు పెద్దపీట వేశారని గుర్తు చేశారు. మైనార్టీల అభ్యున్నతి టీడీపీతోనే సాధ్యమన్నారు. అనంతరం ఉపవాస దీక్షలున్న ముస్లింలకు పల్లె భోజనం వడ్డించారు. కార్యక్రమంలో మండల కన్వీనర్‌ జయచంద్ర, జడ్పీటీసీ మాజీ పిట్టా ఓబులరెడ్డి, జనసేన మండల కన్వీనర్‌ మేకల ఈశ్వర్‌, సర్పంచ శంకర్‌రెడ్డి, ఎంపీటీసీ సభ్యుడు శ్రీనివాసులు, మాజీ కన్వీనర్‌ రాజారెడ్డి, నాయకులు పీట్ల సుధాకర్‌, మండోజీ ఆర్ఫీఖాన, బోపల్లి శివారెడ్డి, తుమ్మల మహబూబ్‌బాషా, గంటా శ్రీనివాసులు, బీసీసెల్‌ అంజనప్ప, ఎద్దుల నారాయణరెడ్డి, తెలుగుయువత బూదిలి ఓబులరెడ్డి, ఎస్సీ సెల్‌ బడిశం రామాంజనేయులు, జిల్లా నాయకులు జాకీర్‌ అహమ్మద్‌, పొగాకుషాన్వాజ్‌, గండికోట ఇర్ఫాద్‌, కొండే ఈశ్వరయ్య, గంగాధర్‌, సురేష్‌, షబ్బీర్‌, షామీర్‌, జెరిపిటి ప్రసాద్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Apr 06 , 2024 | 12:29 AM