MLA Kalava ఎమ్మెల్యే కాలవను కలిసిన వైసీపీ కౌన్సిలర్లు
ABN , Publish Date - Jul 05 , 2024 | 12:21 AM
వైసీపీలో కలకలం మొదలైంది. అసంతృప్తిగా ఉన్న 15 మంది కౌన్సిలర్లు గురువారం ఎమ్మెల్యే కాలవ శ్రీనివాసులును కలిశారు. ఆర్‌అండ్‌బీ అతిథిగృహంలో వైస్‌చైర్మన శ్రీనివాసులు, కౌన్సిలర్లు దేవరాజు, సంజీవ, ఫకృద్ధీన, మంజు, షబ్బీర్‌తో పాటు మరో తొమ్మిదిమంది కలిసి ఎమ్మెల్యేకు పూలమాల వేసి శాలువాతో సన్మానించారు.

- చైర్మన మార్పు దిశగా పావులు
రాయదుర్గం, జూలై 4: వైసీపీలో కలకలం మొదలైంది. అసంతృప్తిగా ఉన్న 15 మంది కౌన్సిలర్లు గురువారం ఎమ్మెల్యే కాలవ శ్రీనివాసులును కలిశారు. ఆర్‌అండ్‌బీ అతిథిగృహంలో వైస్‌చైర్మన శ్రీనివాసులు, కౌన్సిలర్లు దేవరాజు, సంజీవ, ఫకృద్ధీన, మంజు, షబ్బీర్‌తో పాటు మరో తొమ్మిదిమంది కలిసి ఎమ్మెల్యేకు పూలమాల వేసి శాలువాతో సన్మానించారు.
అనంతరం వారు మాట్లాడుతూ.. మూడేళ్లకాలంలో వార్డుల్లో అభివృద్ధి కుంటుపడిందని వాపోయారు. సమస్యలను పరిష్కరించాలని కోరారు. ఇందుకు ఎమ్మెల్యే కాలవ సానుకూలంగా స్పందించారు.
వేడెక్కిన రాజకీయం..
అధికశాతం కౌన్సిలర్లు.. చైర్‌పర్సన శిల్పపై అసంతృప్తితో ఉన్నట్లు కనిపిస్తోంది. ఆమెను కుర్చీ నుంచి దించేందుకు వైసీపీ నాయకత్వంపై ఒత్తిడి తెస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం మారడంతో ఒక్కసారిగా కౌన్సిలర్లలో మెజార్టీ సభ్యులు టీడీపీ వైపు చూస్తున్నారని తెలుస్తోంది. మున్సిపాలిటీలో 32 మంది కౌన్సిలర్లు ఉండగా.. అందులో ఇద్దరు మాత్రమే టీడీపీ వారు. ఎన్నికలకు ముందు ఒక కౌన్సిలర్ టీడీపీలోకి చేరారు. మిగిలిన 29 మందిలో 15 మంది చైర్‌పర్సనపై అసంతృప్తితో ఉన్నట్లు తెలుస్తోంది. వారంతా కాలవ శ్రీనివాసులును కలవడంతో ఒక్కసారిగా రాజకీయం వేడెక్కింది. వారు టీడీపీలో చేరుతారా.. లేక చైర్మన మార్పు కోరుతారా అనే విషయాలపై స్పష్టత రావాల్సి ఉంది. మున్సిపల్ ఎక్స్ ఆఫీషియో సభ్యుడిగా 6వ తేదీన ఎమ్మెల్యే కాలవ శ్రీనివాసులు ప్రమాణ స్వీకారం చేయనున్నారు.
మరిన్ని అనంతపురం వార్తల కోసం..