COUNCIL MEET : నీటి పనులకు వైసీపీ కౌన్సిలర్ల అడ్డంకి
ABN , Publish Date - Jul 31 , 2024 | 11:56 PM
పట్టణానికి నీరందించే గొల్లపల్లి పైప్‌లైనకు సంబంధించి మరమ్మతు పనుల కోసం ఆమోదం తెలపాలని చైర్‌పర్సన ఇంద్రజ కోరగా... వైసీపీ సభ్యులు వాయిదావేస్తూ మధ్యలోనే వెళ్లిపోయారు. స్థానిక మున్సిపల్ కార్యలయంలో బుధవారం చైర్‌పర్సన ఇంద్రజ అధ్యక్షతన కౌన్సిల్ అత్యవసర సమావేశం జరిగింది. ఈ సందర్భంగా అజెండాలోని అంశాలను చదువుతున్న సమయంలో ఆరో అంశం వచ్చే సరికి వైసీపీ కౌన్సిలర్ ఆసిఫ్ మాట్లాడుతూ... అధికారులు మరమ్మతు పనులకు మించి ఎస్టిమేషన వేశారన్నారు. అసలు వారు తయారుచేసిన ఎస్టిమేషన మరమ్మతులకా లేక కొత్తవాటిని కొనుగోలుచేసేందుకా అని ప్రశ్నించారు.
మధ్యలోనే వెళ్లిపోయిన వైసీపీ సభ్యులు
హిందూపురం, జూలై 31: పట్టణానికి నీరందించే గొల్లపల్లి పైప్‌లైనకు సంబంధించి మరమ్మతు పనుల కోసం ఆమోదం తెలపాలని చైర్‌పర్సన ఇంద్రజ కోరగా... వైసీపీ సభ్యులు వాయిదావేస్తూ మధ్యలోనే వెళ్లిపోయారు. స్థానిక మున్సిపల్ కార్యలయంలో బుధవారం చైర్‌పర్సన ఇంద్రజ అధ్యక్షతన కౌన్సిల్ అత్యవసర సమావేశం జరిగింది. ఈ సందర్భంగా అజెండాలోని అంశాలను చదువుతున్న సమయంలో ఆరో అంశం వచ్చే సరికి వైసీపీ కౌన్సిలర్ ఆసిఫ్ మాట్లాడుతూ... అధికారులు మరమ్మతు పనులకు మించి ఎస్టిమేషన వేశారన్నారు. అసలు వారు తయారుచేసిన ఎస్టిమేషన మరమ్మతులకా లేక కొత్తవాటిని కొనుగోలుచేసేందుకా అని ప్రశ్నించారు. దీనిపై వైసీపీ సభ్యులు అభ్యంతరం తెలిపారు. ఇదే సందర్భంలో టీడీపీ కౌన్సిలర్ రమేష్ మాట్లాడుతూ... అభివృద్ధి పనులకు అడ్డుపడకూడదన్నారు.
ఆ నిధులు 2019కి సంబంధించినవని, ఇప్పుడు ఆమోదించకపోతే వెనక్కుపోయే అవకాశం ఉందన్నారు. పట్టణానికి నీటి సమస్య పరిష్కారం కావాలంటే సభ్యులు ఆమోదించాలన్నారు. కానీ వైసీపీ సభ్యులు మాత్రం తాము ఒప్పుకునేది లేదని తెలిపారు. సివిల్ వర్కులు చేయడానికి కాంట్రాక్టర్లు ముందుకు వస్తే తప్ప ఏఏసీ గ్రాంట్‌కు సంబంధించి పనులు చేపట్టకూడదని వైసీపీ కౌన్సిలర్లు సభ నుంచి వెళ్లిపోయారు. అనంతరం టీడీపీ కౌన్సిలర్ రమేష్ మాట్లాడుతూ గత వైసీపీ పాలనలో ఎన్నో అక్రమాలు జరిగాయని, అప్పుడు విచారణకు డిమాండ్ చేయకుండా ఇప్పుడు చేయడం ఏంటని ప్రశ్నించారు. ఇది మంచి పద్ధతి కాదన్నారు. అక్రమాలు జరిగి ఉంటే దానిపై కమిటీ వేయించడానికి తెలుగుదేశం పార్టీ సిద్ధంగా ఉందన్నారు. ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ దృష్టికి తీసుకెళ్లి అవకతవకలు జరిగి ఉంటే చర్యలు తీసుకునేలా తాము కోరుతామన్నారు. అజెండాలో 36అంశాలుండగా 11అంశాలు మినహా మిగిలిన వాటికి ఆమోదం తెలుపుతున్నట్లు చైర్‌పర్సన ఇంద్రజ ప్రకటించారు.
మరిన్ని అనంతపురం వార్తల కోసం....