Share News

politics: రైతుల భూములు కాజేయడానికి వైసీపీ కుట్ర: సత్యకుమార్‌

ABN , Publish Date - Apr 25 , 2024 | 12:51 AM

ధర్మవరం, ఏప్రిల్‌ 24: అవినీతి, భూదందాలకు అలవాటు పడిన వైసీపీ రైతుల భూములు కొట్టేయడానికి కుట్ర జీఓలు తీసుకువచ్చిందని కూటమి బీజేపీ ఎమ్మె ల్యే అభ్యర్థి సత్యకుమార్‌ యాదవ్‌ పేర్కొన్నారు. పట్టణంలోని పార్టీ కార్యాలయంలో బుధవారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఎమ్మెల్యే కేతిరెడ్డి సోలార్‌ మాటున బారీ భూ కుంభకోణానికి తెరతీశారని ఆరోపించారు.

 politics: రైతుల భూములు కాజేయడానికి వైసీపీ కుట్ర: సత్యకుమార్‌
విలేకరులతో మాట్లాడుతున్న సత్యకుమార్‌, పక్కన పరిటాల శ్రీరామ్‌

ధర్మవరం, ఏప్రిల్‌ 24: అవినీతి, భూదందాలకు అలవాటు పడిన వైసీపీ రైతుల భూములు కొట్టేయడానికి కుట్ర జీఓలు తీసుకువచ్చిందని కూటమి బీజేపీ ఎమ్మె ల్యే అభ్యర్థి సత్యకుమార్‌ యాదవ్‌ పేర్కొన్నారు. పట్టణంలోని పార్టీ కార్యాలయంలో బుధవారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఎమ్మెల్యే కేతిరెడ్డి సోలార్‌ మాటున బారీ భూ కుంభకోణానికి తెరతీశారని ఆరోపించారు.

ముదిగుబ్బ మండలంలో సోలార్‌ ప్లాంటు ఏర్పాటుకు అనుమతి వచ్చిందని, అయితే అందుకు ఈ ఏడాది ఫిబ్రవరి 6న చీకటి జీఓ తెచ్చి ప్రైవేటు భూములను కాజేసి రైతుల నోట్లో మట్టి కొట్టడానికి పన్నాగం పన్నారని అన్నారు. సోలార్‌ ముసుగులో ఇదొక భారీ మోసమన్నారు. పరిటాల శ్రీరామ్‌ మాట్లాడుతూ.. సత్యన్న నామినేషనకు టీడీీపీ, జనసేన, బీజేపీ అభిమానులు, నాయకులు, నియోజకవర్గ ప్రజలు భారీ ఎత్తున తరలిరావడం సంతోషంగా ఉందన్నారు. ఈ ప్రజాస్పందన చూసి ప్రత్యర్థి పార్టీకి వణుకు పుట్టిందన్నారు. వచ్చేది కూటమి ప్రభుత్వమేనని ధీమా వ్యక్తం చేశారు. కార్యక్రమంలో టీడీపీనాయకులు కమతం కాటమయ్య, కుమ్మర సాధికారిత రాష్ట్ర చైర్మన పోతలయ్య, జనసేన నాయకులు బెస్తశ్రీనివాసులు, అడ్డగిరి శ్యాంకుమార్‌, బీజేపీ నాయకులు అంబటిసతీశ, జింకాచంద్ర, గుండాపుల్లయ్య,సాకేఓబులేశు పాల్గొన్నారు.

మరిన్ని వార్తల కోసం...

Updated Date - Apr 25 , 2024 | 12:51 AM