భక్తిశ్రద్ధలతో శనిత్రయోదశి పూజలు
ABN , Publish Date - Jun 07 , 2024 | 12:06 AM
వైశాఖ బహుళ అమావాస్యను పురష్క రించుకుని గురువారం నగరంలోని పలు ఆలయాల్లో శని త్రయోదశి పూజ లను నిర్వహిం చారు.

అనంతపురం కల్చరల్, జూన 6 : వైశాఖ బహుళ అమావాస్యను పురష్క రించుకుని గురువారం నగరంలోని పలు ఆలయాల్లో శని త్రయోదశి పూజ లను నిర్వహిం చారు. మొదటి రోడ్డులోని కాశీవిశ్వేశ్వర కోదండరామాల యంలో శనేశ్వరుని మూల విరా ఠ్‌కు వివిధ అభిషేకాలు, ప్రత్యేక పూజలు నిర్వహించారు.
సాయి ట్రస్టు ఆధ్వ ర్యంలో తపో వనంలోని శివశక్తి దేవాలయంలో పూజలు నిర్వహిం చారు. శనేశ్వరునికి నువ్వుల నూనెతో తైలాభిషేకం చేయడంతోపాటు నువ్వులు, బియ్యంతో కలిపిన ప్రత్యేక పదార్థాలు, పిండివంటలతో నివేదన చేశారు. కార్యక్రమంలో ఆలయ ధర్మకర్త శ్రీరాములు, దేవేంద్ర, కెకె గాంధీ, దీప, అనీల్‌కుమార్ పాల్గొన్నారు.