అధ్వానంగా గ్రామీణ రహదారులు
ABN , Publish Date - Apr 03 , 2024 | 12:10 AM
రహదారులు బాగుంటే రాకపోకలు సౌకర్యంగా ఉండి గ్రామాలు బాగా అభివృద్ధిచెందుతాయి. గడచిన నాలుగున్నరేళ్ల లో గ్రామీణ రహదారుల అభివృద్ది పడకేసింది.

ఇబ్బందులు పడుతున్న ప్రజలు
మడకశిర రూరల్, ఏప్రిల్ 2: రహదారులు బాగుంటే రాకపోకలు సౌకర్యంగా ఉండి గ్రామాలు బాగా అభివృద్ధిచెందుతాయి. గడచిన నాలుగున్నరేళ్ల లో గ్రామీణ రహదారుల అభివృద్ది పడకేసింది. గ్రామాలకు మంచి రోడ్లు వేయిస్తామని పాలకులు హామీలు ఇచ్చారు. కానీ నేరవేర్చలేదు. హామీలు అలాగే మిగిలిపోయాయి. మండలంలో సరియైున రహదారులు లేని గ్రామాలు అనేకం ఉన్నాయి. కొన్ని గ్రామాలకు సీపీ రోడ్డు వేస్తూ నిధుల కొరత కారణంగా పనులు అర్థాంతరంగా ఆగిపోయాయి. మరికొన్ని గ్రామాల్లో రహదారులు వేయడానికి అనుమతులు వచ్చినా పనులు చేయడానికి కాంట్రాక్టర్లు ముందుకు రా కపోవ డంతో పనులు ప్రారంభం కాలేదు. మణూరు నుంచి గంతలపల్లి, కల్లుమర్రి వేళ్లే ప్రధాన రహదారి ఇరువైపులా కంపచెట్లు పెరగడంతో ఆ రహదారిలో రాకపోకలు పూర్తిగా నిల్చిపోయాయి. కొత్తలం నుంచి ఎగువ అచ్చంపల్లి వెళ్లే రహదారి పూ ర్తిగా దెబ్బతింది. వర్షాం వచ్చిందటే ఆ రహదారిలో రాకపోకలు బంద్. సీ కోడిగే పల్లి పంచాయతీలోని గ్రామాల్లో రహదారులు అన్నీ దెబ్బతిని గుంతల మయం అయ్యాయి. ఏల్లోటి గ్రామంలోకి వేళ్లే రహదారి గుంతమయం కావడంతో ఆటోలు కూడా సరిగా ఆ గ్రామానికి వెళ్లడంలేదు. మడకశిర నుంచి హరేసముద్రం, భక్తర హ ళ్లికి వేళ్లే రహదారులు పూర్తి దెబ్బతిన్నాయి. భక్తరహళ్లి నుంచి కర్ణాటక సరి హద్దు వరకు వేస్తున్న రోడ్డుకు నిధుల కోరత కారణంగా కంకర వేసి వదిలేశారు. ఆ రోడ్డు గుండా వెళ్లడానికి పాదాచారులు కూడా ఇబ్బందులు పడుతున్నారు. గ్రామీణ రహదారుల్లో ప్రయాణం చేయాలంటే నరకయాతన అనుభవిస్తున్నా మని, భయందోళన చెందుతున్నామని ఆయా గ్రామాల ప్రజలు వాపోతున్నారు.