Share News

కమిషనర్‌ చాంబర్‌లో కార్మికుల నిరసన

ABN , Publish Date - Feb 17 , 2024 | 12:14 AM

తమ హామీలు నెరవేర్చాలంటూ మునిసిపల్‌ పారిశుధ్య కార్మికులు శుక్రవారం మునిసిపల్‌ కమిషనర్‌ చాంబర్‌ లో బైఠాయించి నిరసన చేపట్టారు.

కమిషనర్‌ చాంబర్‌లో కార్మికుల నిరసన
కమిషనర్‌ చాంబర్‌లో బైఠాయించిన పారిశుధ్య కార్మికులు

హిందూపురం అర్బన, ఫిబ్రవరి 16: తమ హామీలు నెరవేర్చాలంటూ మునిసిపల్‌ పారిశుధ్య కార్మికులు శుక్రవారం మునిసిపల్‌ కమిషనర్‌ చాంబర్‌ లో బైఠాయించి నిరసన చేపట్టారు. గత ఏడాది డిసెంబర్‌లో మునిసిపల్‌ కాంట్రాక్టు, అవుట్‌ సోర్సింగ్‌ కార్మికులు రాష్ట్ర వ్యాప్త సమ్మె నిర్వహించారు. అప్పుడు ఇచ్చిన హామీలు నెరవేర్చాలంటూ మొదట కమిషనర్‌ కార్యాలయం ముందు కూర్చుని నిరసన తెలిపారు. కమిషనర్‌ ఎంత సేపటికి రాకపోయే సరికి చాంబర్‌లోకి వెళ్లి నిరసన చేపట్టారు. గతంలో 16 రోజులు సమ్మెలో ఉండగా అప్పటి మునిసిపల్‌ కమిషనర్‌ ప్రమోద్‌కుమార్‌ ఇచ్చిన మూడు హామీలపౖ ప్రస్తుత కమిషనర్‌ శ్రీకాంతరెడ్డిని అడిగారు. హామీలు ఇచ్చింది నేను కాదు గత కమిషనర్‌ అని తాను నెరవేర్చలేనన్నారు. దీంతో మునిసిపల్‌ కార్మి కులు ఆగ్రహించారు. భవిష్యత కార్యచరణకు మీరే బాధ్యులు అని హెచ్చరిం చి వెనుతిరిగారు. కార్యక్రమంలో మునిసిపల్‌ కార్మిక యూనియన నాయకులు మల్లికార్జున, జగదీష్‌, ఆనంద్‌, గురునాథ్‌, పరమేష్‌ చంద్ర, సీఐటీయూ నాయకులు సాంబశివ, రాజప్ప, రామకృష్ణ వదలాది మంది మునిసిపల్‌ కార్మికులు ఉన్నారు.

Updated Date - Feb 17 , 2024 | 12:14 AM