Share News

కార్మికుల సమస్యల్ని వెంటనే పరిష్కరించాలి

ABN , Publish Date - Jan 07 , 2024 | 12:34 AM

పుట్టపర్తి, జనవరి 6: మున్సిపల్‌ కార్మికుల సమస్యల్ని వెంటనే పరిష్కరించాలని ఏఐటీయూసీ జిల్లా కార్యదర్శి ఆంజనేయులు ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. పట్టణంలో మున్సిపల్‌ కార్మికులు చేపట్టిన నిరవధిక సమ్మె శనివారం నాటికి 12వ రోజుకు చేరింది.

కార్మికుల సమస్యల్ని వెంటనే పరిష్కరించాలి

  • ఏఐటీయూసీ జిల్లా కార్యదర్శి ఆంజనేయులు

పుట్టపర్తి, జనవరి 6: మున్సిపల్‌ కార్మికుల సమస్యల్ని వెంటనే పరిష్కరించాలని ఏఐటీయూసీ జిల్లా కార్యదర్శి ఆంజనేయులు ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. పట్టణంలో మున్సిపల్‌ కార్మికులు చేపట్టిన నిరవధిక సమ్మె శనివారం నాటికి 12వ రోజుకు చేరింది. స్థానిక మున్సిపల్‌ కార్యాలయం వద్ద వారు నిరసన కొనసాగించారు. వారికి ఏఐటీయూసీ జిల్లా కార్యదర్శి మద్దతు తెలిపి మాట్లాడారు. కార్మికుల సమస్యలు పరిష్కరించడంలో ప్రభుత్వం విఫలమైందన్నారు. 12రోజులుగా సమ్మె చేసున్నా సీఎంకు కనీసం చీమకుట్టినట్లు కూడా లేదని మండిపడ్డారు. ఇప్పటికైనా స్పందించాలని కోరారు. పట్టణంలో పారిశుధ్య పనులు చేయకుండా కార్మికులు అడ్డుకున్నారు. తమ సమస్యలు పరిష్కరించేవరకు సమ్మె కొనసాగిస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో సీఐటీయూ నాయకులు లక్ష్మీనారాయణ, గంగాద్రి, ఏఐటీయూసీ నాయకుడు గౌస్‌లాజం, కార్మిక నాయకులు రామయ్య, పెద్దన్న, నరసింహులు, నాగార్జున పాల్గొన్నారు.

Updated Date - Jan 07 , 2024 | 12:34 AM