గెలుపే లక్ష్యంగా పని చేయాలి
ABN , Publish Date - Jan 12 , 2024 | 12:34 AM
కదిరి, జనవరి 11: వచ్చే ఎన్నికల్లో టీడీపీ గెలుపే లక్ష్యంగా కార్యకర్తలు, నాయకులు పనిచేయాలని ఆ పార్టీ నియోజకవర్గ ఇనచార్జి కందికుంట వెంకటప్రసాద్ పేర్కొన్నారు.

- టీడీపీ శ్రేణులకు కందికుంట సూచన - వైసీపీ నుంచి 25 కుటుంబాల చేరిక
కదిరి, జనవరి 11: వచ్చే ఎన్నికల్లో టీడీపీ గెలుపే లక్ష్యంగా కార్యకర్తలు, నాయకులు పనిచేయాలని ఆ పార్టీ నియోజకవర్గ ఇనచార్జి కందికుంట వెంకటప్రసాద్ పేర్కొన్నారు. పట్టణంలోని ఆయన నివాసంలో గురువారం తలుపుల మండలం పులిగిండ్లపల్లి, ఉడమలకుర్తి పంచాయతీలకు చెందిన 25 కుటుంబాల వారు వైసీపీని వీడి టీడీపీలోకి చేరారు. వారికి కందికుంట కండువాలు వేసి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రానున్న ఎన్నికల్లో ప్రతిఒక్కరూ టీడీపీ విజయానికి సైనికుల్లా కృషి చేయాలన్నారు. కష్ట పడి పని చేసిన వారికి తగిన గుర్తింపు ఉంటుందని చెప్పారు. చేరిన వారిలో సోమాలవాండ్లపల్లికి చె ందిన మార్కండేయ, వీర కొండయ్య, పాపయ్య, పూజ, పుల్లిగిండ్లపల్లికి చెందిన వెంకటేష్, క్రిష్ణ, జీవన, పద్మావతమ్మ, నారాయణమ్మ తదితరులు ఉన్నారు. కార్యక్రమంలో తలుపుల మండల నాయకులు ముబారక్, మేడా శంకర్, విశ్వనాథ్‌రెడ్డి, రాజారెడ్డి, రమణ, నారాయణరెడ్డి, బాబ్‌జాన, రాధాకృష్ణ, అంజి, రామ్మోహన తదితరులు ఉన్నారు.