Share News

బలిజల అభివృద్ధికి కృషి: అమిలినేని

ABN , Publish Date - Mar 12 , 2024 | 11:53 PM

బలిజ సామాజిక వర్గం అంటే నాకు ప్రత్యేక గౌరవం ఉంది, ఈ ఎన్నికల్లో వారంతా నాకు అండగా నిలిచి గెలిపిస్తారనే నమ్మకం ఉందని అమిలినేని సురేంద్ర అన్నారు.

బలిజల అభివృద్ధికి కృషి: అమిలినేని
సురేంద్రబాబును సన్మానిస్తున్న బలిజ సంఘం నాయకులు

కళ్యాణదుర్గం, మార్చి 12: బలిజ సామాజిక వర్గం అంటే నాకు ప్రత్యేక గౌరవం ఉంది, ఈ ఎన్నికల్లో వారంతా నాకు అండగా నిలిచి గెలిపిస్తారనే నమ్మకం ఉందని అమిలినేని సురేంద్ర అన్నారు. మంగళవారం పట్టణంలోని బలిజ సంఘం కమ్యూనిటీ హాల్‌లో జరిగిన బలిజల ఆత్మీయ సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. జనసేన నాయకుడు లక్ష్మీపతితో పాటు జిల్లా కార్యదర్శులు సంజీవ రాయుడు, నగర ఉపాధ్యక్షులు గ్రంధి దివాకర్‌, జక్కిరెడ్డి ఆదినారాయణ, నాయకులు వెన్నెల కృష్ణ, మధు తదితరులు హాజరయ్యారు. స్థానిక బలిజ సంఘం నేతలు బట్నా తిమ్మరాజు, లక్ష్మీ నరసయ్య, వెంకటలక్ష్మయ్య, కృష్ణమూర్తి, ముప్పూరు దేవరాజు, కట్టారాము, మల్లికార్జున, గాజుల రాఘవేంద్ర, పాండురంగ తదితరులు సభలో పాల్గొని అభ్యర్థి అమిలినేని సురేంద్ర బాబును ఘనంగా సన్మానించారు. సురేంద్రబాబు మాట్లాడుతూ మీలో ఒకడిని అధికారంలోకి వస్తే ఎలాంటి సమస్యలు ఉన్నా పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ఆత్మీయ సమావేశానికి హాజరైన వందలాది మంది మాట్లాడుతూ టీడీపీని వెన్నంటి వుంటామని సురేంద్రబాబును గెలిపిస్తామని అన్నారు.

నాయీబ్రాహ్మణులను ఆదుకుంది టీడీపీనే

నాయీ బ్రాహ్మణులను ఆదుకున్నది తెలుగుదేశం పార్టీనేనని అమిలినేని సురేంద్రబాబు అన్నారు. ఆపద వస్తే అండగా ఉంటానని జరగబోయే ఎన్నికల్లో మీరు ఆశీర్వదించి శాసనసభకు పంపిస్తే అండగా ఉంటానని హామీ ఇచ్చారు. మంగళవారం నాయీ బ్రాహ్మణుల సంఘం నాయకులు ఏర్పాటు చేసిన సమావేశానికి ఆయనముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఆయన మాట్లాడుతూ నాయీ బ్రాహ్మణులను ఆదుకున్న ఘనత టీడీపీకే దక్కిందన్నారు. వారికి వృత్తి పరికరాలు సబ్సిడీ ఇచ్చి ఆర్థికంగా చేయూతనిచ్చిన టీడీపీకే పట్టం కట్టాలన్నారు. కళ్యాణదుర్గం నియోజకవర్గ ప్రజలకు సేవ చేయడమే లక్ష్యంగా రాజకీయాల్లోకి వచ్చానని, స్థానికంగా నివాసం కూడా ఏర్పాటు చేసుకున్నానన్నారు. సంఘం సభ్యులు వారి సమస్యలను వినతిపత్రం రూపంలో సురేంద్రబాబుకు అందజేశారు. అందుకు తక్షణమే స్పం దించి త్యాగరాజు భవన మరమ్మతుకు రూ.లక్ష ఆర్థిక సహాయం ప్రకటించారు.

Updated Date - Mar 12 , 2024 | 11:53 PM