Share News

ఆడపడుచుల రుణం తీర్చుకోలేనిది: నారా భువనేశ్వరి

ABN , Publish Date - Feb 15 , 2024 | 12:40 AM

బత్తలపలి,్ల ఫిబ్రవరి 14: ఇళ్లు వదిలి ఏనాడూ బయటకు రాని ఆడపడుచులు చంద్రబాబును అక్రమ కేసుల్లో అరెస్టు చేసినప్పుడు రోడ్డు మీదకు వచ్చి న్యాయం కోసం పారాటాలు చేశారని, వారి రుణం తీర్చుకోలేనిదని నారా చంద్రబాబు నాయుడి సతీమణి నారా భువనేశ్వరి పేర్కొన్నారు.

 ఆడపడుచుల రుణం తీర్చుకోలేనిది: నారా భువనేశ్వరి

బత్తలపలి,్ల ఫిబ్రవరి 14: ఇళ్లు వదిలి ఏనాడూ బయటకు రాని ఆడపడుచులు చంద్రబాబును అక్రమ కేసుల్లో అరెస్టు చేసినప్పుడు రోడ్డు మీదకు వచ్చి న్యాయం కోసం పారాటాలు చేశారని, వారి రుణం తీర్చుకోలేనిదని నారా చంద్రబాబు నాయుడి సతీమణి నారా భువనేశ్వరి పేర్కొన్నారు. నిజం గెలవాలి కార్యక్రమంలో భాగంగా బుధవారం ఆమె బత్తలపల్లి మండలంలో పర్యటించారు. మండలకేంద్రానికి చేరుకోగానే టీడీపీ శ్రేణులు, స్థానికులు ఆమెకు ఘన స్వాగతం పలికారు. ఆమె అందరికీ అభివాదం చేస్తూ.. ముందుకు కదిలారు. అనంతరం మండలంలోని సంజీవపురం గ్రామానికి చేరుకుని అక్కడ చంద్రబాబు అరెస్టును తట్టుకోలేక మరణించిన వెంకటరాముడు, చక్రయ్య ఇళ్లకు వెళ్లారు. తొలుత మృతుల చిత్రపటాలకు నివాళులర్పించారు. తర్వాత వారి కుటుంబసభ్యులను పరామర్శించి... అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. అలాగే ఒక్కో కుటుంబానికి రూ.3లక్షల చెక్కును అందించారు. అనంతరం గ్రామంలోని నాగల కట్ట వద్ద ప్రత్యేక పూజలు చేశారు. అక్కడ ఏర్పాటు చేసిన సమావేశంలో ఆమె మాట్లాడుతూ.. ఇళ్లు వదలి బయటకు రాని ఎందరో ఆడపడుచులు వైసీపీ ప్రభుత్వం చంద్రబాబును అక్రమకేసుల్లో అరెస్టు చేసి జైల్లో పెట్టిన సమయంలో.. ఆయనకు మద్దతుగా ఏకంగా రోడ్ల మీదకు వచ్చి పోరాడారని తెలిపారు. వారి రుణం ఎప్పటికీ తీర్చుకోలేమన్నారు. మీరంతా ఉన్నరన్న ధైౖర్యంతోనే ఈరోజు నేను ఇలా తిరుగుతున్నానని తెలిపారు. రాష్ట్రం బాగుండాలంటే వచ్చే ఎన్నికల్లో టీడీపీని గెలిపించాలని కోరారు. కార్యక్రమంలో మాజీ మంత్రి పరిటాల సునీత, ఎమ్మెల్సీ అనూరాధ, టీడీపీ నియోజకవర్గ ఇనచార్జి పరిటాలశ్రీరాం, నాయకులు బండారుశ్రావణి, విజయ్‌కుమార్‌, చల్లాశ్రీనివాసులు, నారాయణరెడ్డి, జగ్గు, సతీష్‌, సాంబ, తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Feb 15 , 2024 | 12:40 AM