Share News

Women on the road for drinking water తాగునీటి కోసం రోడ్డెక్కిన మహిళలు

ABN , Publish Date - Jul 08 , 2024 | 12:19 AM

తాగునీటి కోసం మహిళలు రోడ్డెక్కారు. వజ్రకరూరు మండలం కొనకొండ్ల గ్రామంలో తాగునీటి సమస్యను పరిష్కరించాలని కోరుతూ మహిళలు స్థానిక గుంతకల్లు-ఉరవకొండ రోడ్డుపై రాస్తారోకో నిర్వహించారు.

Women on the road for drinking water  తాగునీటి కోసం రోడ్డెక్కిన మహిళలు
ఖాళీ బిందెలతో రాస్తారోకో చేస్తున్న మహిళలు

- ఖాళీబిందెలతో రాస్తారోకో

ఉరవకొండ, జూలై7: తాగునీటి కోసం మహిళలు రోడ్డెక్కారు. వజ్రకరూరు మండలం కొనకొండ్ల గ్రామంలో తాగునీటి సమస్యను పరిష్కరించాలని కోరుతూ మహిళలు స్థానిక గుంతకల్లు-ఉరవకొండ రోడ్డుపై రాస్తారోకో నిర్వహించారు.


ఖాళీ బిందెలతో బైఠాయించి నిరసన తెలిపారు. తమ గ్రామంలోని 4, 5వ వార్డులలో 10 రోజుల నుంచి తాగు నీరు సరఫరా కావడం లేదని వాపోయారు. దీంతో తీవ్ర ఇబ్బంది పడుతున్నామని అన్నారు. సమస్యను అధికారులకు పలుమార్లు విన్నవించినా పట్టించుకోలేదన్నారు. అందుకే రాస్తారోకోకు దిగామన్నారు. రాస్తారోకోతో గుంతకల్లు- ఉరవకొండ రహదారిలో ట్రాఫిక్‌ స్తంభించిపోయింది. విషయం తెలుసుకున్న ఎస్‌ఐ నరేష్‌ అక్కడికి చేరుకుని ఆందోళన విరమించాలని సూచించారు. సమస్య పరిష్కారమయ్యేవరకూ విరమించే ప్రసక్తేలేదని భీష్మించుకుకూర్చున్నా రు. ఎస్‌ఐ ఆర్‌డబ్ల్యూఎస్‌ అధికారులతో ఫోనలో మాట్లాడించారు. సమస్యను పరిష్కరిస్తామని వారు హామీ ఇవ్వడంతో మహిళలు ఆందోళన విరమించారు.


మరిన్ని అనంతపురం వార్తల కోసం...

Updated Date - Jul 08 , 2024 | 12:19 AM