మీ ఓటుతో రాయదుర్గం తలరాత మారాలి: కాలవ
ABN , Publish Date - Mar 04 , 2024 | 12:22 AM
మీరు వేసే ఓటు రాయదుర్గం తలరాతను మార్చేలా ఉండాలని రాయదుర్గం నియోజకవర్గ అభ్యర్థి, మాజీ మంత్రి కాలవ శ్రీనివాసులు పిలుపునిచ్చారు.
రాయదుర్గం, మార్చి 3: మీరు వేసే ఓటు రాయదుర్గం తలరాతను మార్చేలా ఉండాలని రాయదుర్గం నియోజకవర్గ అభ్యర్థి, మాజీ మంత్రి కాలవ శ్రీనివాసులు పిలుపునిచ్చారు. ఆదివారం పట్టణంలోని సీతారామాంజనేయ కళ్యాణమంటపంలో పద్మశాలీయుల ఆత్మీయ సమేళనాన్ని పార్టీ జిల్లా అధికార ప్రతినిధి పొరాళ్లు పురుషోత్తం అధ్యక్షతన జరిగింది. తొలుత మార్కండేయస్వామి చిత్రపటానికి పూలమాల వేసి సభను ప్రారంభించారు. ముఖ్యఅతిథిగా పాల్గొన్న కాలవ మాట్లాడుతూ 2014లో రాయదుర్గం నుంచి ఎటువైపు వెళ్లినా రహదారులు బాగలేవన్నారు. గ్రామానికి ఎక్కువ పట్టణానికి తక్కువగా ఉండే రాయదుర్గంను జాతీయ రహదారికి అనుసంధానం చేయించానన్నారు. మూడు ఫ్లైఓవర్లల ఏర్పాటు పట్టణంలో రోడ్డు విస్తరణ చేసి రూపాన్నే మార్చామన్నారు. చేనేతవర్గాలు ఎప్పటికీ తెలుగుదేశం వెంట నడుస్తున్నారని కొనియాడారు. ఎవరి నాయకత్వంలో శాంతిభద్రతలకు సమస్య లేకుండా ప్రశాంతమైన రాయదుర్గం ఉంటుందో గత అనుభవాన్ని గుర్తు చేసుకుని నిర్ణయం తీసుకోవాలన్నారు. 50 వేల మెజార్టీతో గెలువబోతున్నామన్నారు. ఆ గెలుపులో చేనేతలు అందులో పద్మశాలీల పాత్ర కీలకంగా ఉండాలని కోరారు.
కలిసి పని చేద్దాం చంద్రబాబుని గెలిపిద్దాం
బొమ్మనహాళ్: కలిసికట్టుగా పనిచేసి తెలుగుదేశం పార్టీని గెలిపించుకొని చంద్రబాబును ముఖ్యమంత్రిగా చూడడమే లక్ష్యంగా పనిచేయాలని కాలవ శ్రీనివాసులు అన్నారు. మండలంలోని ఎల్‌బీనగర్ గ్రామానికి చెందిన ముల్లంగి నారాయణస్వామి, ముల్లంగి భాస్కర్‌నాయుడు వైసీపీ నుంచి టీడీపీలోకి వస్తున్న నేపథ్యంలో ఆదివారం ఆత్మీయ సమావేశం నిర్వహించారు. కాలవ శ్రీనివాసులు మాట్లాడుతూ ముల్లంగి నారాయణస్వామి తిరిగి సొంత గూటికి వస్తుండడం ఆనందంగా ఉందన్నారు. వీరితోపాటు బొమ్మనహాళ్, హరేసముద్రం, ఉంతకల్లు గ్రామాలకు చెందిన కొందరు వైసీపీ నాయకులు టీడీపీలోకి అధికారికంగా ఒకటి రెండురోజుల్లో చేరబోతున్నారని అన్నారు. తెలుగురైతు రాష్ట్ర ఉపాధ్యక్షులు కొండాపురం కేశవరెడ్డి, మండల కన్వీనర్లు బలరాంరెడ్డి, హనుమంతరెడ్డి, మార్కెట్‌యార్డ్ మాజీ చైర్మన చంద్రహాస్, ఎర్రగుంట్ల వెంకటేశులు, తిమ్మరాజు, ఉప్పరహాళ్ స్వామి, కురువళ్లి తిప్పేస్వామి, పయ్యావుల మోహనబాబు, సుదర్శనరెడ్డి, పయ్యావుల అనిల్, శివశంకర్‌రెడ్డి, కావలి రాము, ప్రభు, గోవిందు, దివాకర్, మాజీ సర్పంచలు గోవిందరెడ్డి, కేశప్ప, ఉపసర్పంచ హనుమంతప్ప, మాజీ డైరెక్టర్ నాగరాజు, సంగప్ప, శివ పాల్గొన్నారు.
పార్టీ బలోపేతానికి కృషి చేయండి
రాయదుర్గంరూరల్: తెలుగుదేశం పార్టీ అభివృద్ధికి ప్రతి ఒక్కరూ సైనికుల్లా కృషి చేయాలని రాయదుర్గం నియోజకవర్గం టీడీపీ అభ్యర్థి కాలవ శ్రీనివాసులు సూచించారు. ఆదివారం మండలంలోని పల్లేపల్లి గ్రామంలోని మాజీ డీసీసీ పాటిల్ వేణుగోపాల్‌రెడ్డి తనయుడు పాటిల్ అజయ్‌కుమార్‌రెడ్డి ఆహ్వానం మేరకు గ్రామంలో సమావేశం నిర్వహించారు. మాజీ మంత్రి మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీని గెలిపించేందుకు కార్యకర్తలు, నాయకులు సమాయత్తం కావాలన్నారు. రాష్ట్రంలో అరాచకపాలన కొనసాగుతుందని ఆ పాలనకు చరమగీతం పాడేందుకు ప్రతి ఒక్కరూ సిద్ధం కావాలన్నారు. కార్యక్రమంలో పాటిల్ సదాశివారెడ్డి, పాటిల్ అజయ్‌కుమార్‌రెడ్డి, మండల కన్వీనర్లు హనుమంతరెడ్డి, హనుమంతు, మోహనరెడ్డి, సోమశేఖర్, ఈరన్న పాల్గొన్నారు.
టీడీపీలోకి చేరికలతో వైసీపీ గుండెల్లో గుబులు
కణేకల్లు: నియోజకవర్గంలో ప్రతిరోజూ ఎస్సీ, బీసీ, మైనార్టీతో పాటు ఇతర వర్గాలు టీడీపీలో చేరుతుండడంతో వైసీపీ నాయకుల గుండెల్లో గుబులు రేపుతోందని కాలవ శ్రీనివాసులు అన్నారు. ఆదివారం మార్కెట్‌యార్డు మాజీ చైర్మన ఎస్‌కే మల్లికార్జున ఆధ్వర్యంలో కణేకల్లు పట్టణానికి చెందిన 25 కుటుంబాలు కాలవ ఆధ్వర్యంలో టీడీపీలో చేరాయి. గస్తీ వెంకటేశులు, నాగరాజు, చిక్కణ్ణ, జాలేటి, బాలకృష్ణ, వన్నారెడ్డి, రఫీక్‌తో పాటు పలువురుకు టీడీపీ కండువాలు వేసి పార్టీలోకి ఆహ్వానించారు. కార్యక్రమంలో లాలెప్ప, ఆనంద్, వేలూరు మరియప్ప, బీటీ రమేష్, అనిల్, చంద్రశేఖర్‌గుప్తా, మాబుసాబ్, చాంద్‌బాషా, వెంకటేశులు, జయరాంచౌదరి, మారుతి, హరి, ఈరప్ప, వన్నూరుస్వామి, చిరంజీవి, ఆదినారాయణ, నాగార్జున పాల్గొన్నారు.