Share News

జేసీపీఆర్‌ రాకతో పరారైన ఇసుక అక్రమ తరలింపు దారులు

ABN , Publish Date - Jan 12 , 2024 | 12:16 AM

మండలకేంద్రంలోని పెన్నానదిలో జరుగుతున్న ఇసుక అక్రమ రవాణాను అడ్డుకొనేందుకు తాడిపత్రి నుంచి మున్సిపల్‌ చైర్మన జేసీ ప్రభాకర్‌రెడ్డి వస్తున్నారన్న విషయం తెలుసుకున్న ఇసుక తరలింపుదారులు పరారయ్యారు.

జేసీపీఆర్‌ రాకతో పరారైన  ఇసుక అక్రమ తరలింపు దారులు
మాట్లాడుతున్న జేసీపీఆర్‌

పెద్దపప్పూరు, జనవరి 11: మండలకేంద్రంలోని పెన్నానదిలో జరుగుతున్న ఇసుక అక్రమ రవాణాను అడ్డుకొనేందుకు తాడిపత్రి నుంచి మున్సిపల్‌ చైర్మన జేసీ ప్రభాకర్‌రెడ్డి వస్తున్నారన్న విషయం తెలుసుకున్న ఇసుక తరలింపుదారులు పరారయ్యారు. మండలకేంద్రంలోని పెన్నానదిలో ఇసుకరీచ పేరుతో అక్రమంగా ఇసుకను టిప్పర్లు, ట్రాక్టర్ల ద్వారా పెద్దఎత్తున తరలిస్తున్నారన్న విషయం తెలుసుకున్న జేసీ అడ్డుకొనేందుకు వచ్చారు. విషయం ముందుగానే పసిగట్టిన వైసీపీ మద్ధతుదారులు ట్రాక్టర్లు, టిప్పర్లతో అక్కడి నుంచి పరారయ్యారు. జేసీ ప్రభాకర్‌రెడ్డి విలేకరులతో మాట్లాడుతూ తన రాకను చూసి ఇసుక అక్రమ దారులు పరారయ్యారన్నారు. నాలుగేళ్లుగా ఇసుక తరలింపును అడ్డుకొనేందుకు పలు రకాలుగా ప్రయత్నించామన్నారు. ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్లినా పట్టించుకోకపోవడంతో ప్రజలే అడ్డుకోవాలని పిలుపునిచ్చామన్నారు. నియోజకవర్గంలో అభివృద్ధికి నేను వ్యతిరేకిని కానని ఇతర జిల్లాలకు ఇసుకను తరలించి సొమ్ము చేసుకుంటున్న వారికి వ్యతిరేకంగా పోరాడుతున్నానని ఆయన తెలిపారు.

Updated Date - Jan 12 , 2024 | 12:16 AM