YCP RULE : పాలన గాడిలో పడేనా..?
ABN , Publish Date - Jun 07 , 2024 | 12:19 AM
మండల స్థాయి ప్రభు త్వ కార్యాలయాలు వైసీపీ ప్రభుత్వ హయాంలో నిర్వీ ర్యమయ్యాయి. అధికారుల పనితీరుపై పర్యవే క్షణ లేకపోవడంతో ప్రజా పాలన గాడి తప్పింది. దీంతో స మస్యల పరిష్కారం కోసం ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మండలంలో ప్రధానమైన తహసీ ల్దార్, మండల పరిషత, పోలీస్ స్టేషన వంటి ప్రభు త్వ కార్యాలయాల్లో ఇలాంటి పరిస్థితి నెల కొంది.

వైసీపీ హయాంలో ప్రభుత్వ కార్యాలయాలు నిర్వీర్యం
ప్రజలకు దూరమైన సేవలు
చిలమత్తూరు, జూన 6: మండల స్థాయి ప్రభు త్వ కార్యాలయాలు వైసీపీ ప్రభుత్వ హయాంలో నిర్వీ ర్యమయ్యాయి. అధికారుల పనితీరుపై పర్యవే క్షణ లేకపోవడంతో ప్రజా పాలన గాడి తప్పింది. దీంతో స మస్యల పరిష్కారం కోసం ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మండలంలో ప్రధానమైన తహసీ ల్దార్, మండల పరిషత, పోలీస్ స్టేషన వంటి ప్రభు త్వ కార్యాలయాల్లో ఇలాంటి పరిస్థితి నెల కొంది. బాధితులు రోజులు తరబడి కార్యాలయాల చుట్టూ తిరిగినా కనీసం సమస్య వినేవారు కూడా లేకపోయారు. మండలస్థాయి మేసిసే్ట్రట్ అయిన తహసీల్దార్ కార్యాలయం నుంచే రెవెన్యూకు సంబంధించిన పాలన సాగుతుంది. ఐదేళ్లుగా వైసీపీ నాయకులకు అడ్డాగా మారింది. వారు చెప్పినట్లుగానే ఈ కార్యాలయంలో పనులు జరిగేవి.
దీనిని ఆసరాగా తీసుకున్న కొందరు ఉద్యోగులు తమ విధులు మరచి అక్రమార్జనకు అలవాటు పడ్డారు. సమస్యలతో వచ్చే ప్రజలకు అందుబాటులో లేకుండా సొంత పనుల్లో బిజీగా గడిపారు. వైసీపీ నాయకులు చెబితేనే పను లు చేసి పెట్టారు. లేదంటే డబ్బులతో రావాలని చెప్పి న సందర్భాలు కోకల్లులు. దీంతో ప్రజలు గత టీడీపీ పాలనను గుర్తుకు తెచ్చుకున్నారు. అప్పట్లో ప్రభుత్వ కార్యాలయాల్లో క్రమశి క్షణ ఉండేదని ఇప్పడు అవి కనపడలేదని బాహాటంగానే చెబుతున్నారు. ఇక మండల పరిషత వ్యవహారినికొస్తే వైసీపీ పాలనలో పూర్తిగా నిర్వీర్యమైన ప్రభుత్వ శాఖ ఇది అని చెప్ప వచ్చు. మండల పరిషత పాలకవర్గం పూర్తిగా వైసీపీ చేతుల్లో ఉన్నా గ్రామాల్లో అభివృద్ది జరగలేదన్నది జగమెరిగిన సత్యం. ఈ ఐదేళ్లలో కార్యాలయంలో పని చేసే అధికారులు కూడా పాలనపై దృష్టి పెట్టలేదు. పాలకవర్గానికి వత్తాసుపలుకుతూ కాలం వెళ్ల బుచ్చారనడంలో ఎలాంటి సందేహం లేదు. చివ రికి మండల సర్వసభ్యసమావేశాలు కూడా తూతూ మం త్రంగా జరిగాయనడంలో అతిశయోక్తి లేదు. అదే విధంగా వైసీపీ పాలనలో పోలీస్ స్టేషన పూర్తిగా పంచాయితీలకు అడ్డాగా మారిందనే చెప్పవచ్చు. ఫి ర్యాదులతో వచ్చే ప్రజలకు పరిష్కారాలు దొరక్క ఇబ్బందిపడిన సంఘటనలు అనేకం. కేవలం వైసీపీ నాయకుల కనుసన్నల్లో కేసుల నమోదు జరి గింద నేది వాస్తవం. గ్రామాల్లో శాంతి భధ్రతల విష యం లో ప్రజలకు జవాబుదారీగా ఉండాల్సిన పోలీసు లు వైసీపీ నాయకుల కనుసన్నల్లో మెలగాల్సి వచ్చింది.
మంచి పాలన కోసం కోటి ఆశలతో...
రాష్ట్రంలో ప్రభుత్వం మారడంతో మండల స్థాయి లో మంచి పాలన అందుతుందన్న కోటి ఆశలతో ప్రజలు ఉన్నారు. గత వైసీపీ ప్రభుత్వంలో నిర్వీర్య మైన ప్రభుత్వ కార్యాలయాలు కొత్త ప్రభుత్వంలో దారికి వస్తాయన్న నమ్మకంతో ఉన్నారు. దారితప్పిన అధికారులను గాడిలో పెట్టి ప్రజలకు మంచి సేవలు అందించేందుకు చర్యలు చేపడుతారని ప్రజలు అభిప్రాయపడుతున్నారు.
మరిన్ని అనంతపురం వార్తల కోసం....