Share News

పెనుకొండ నుంచి ఎమ్మెల్యేగా పోటీచేస్తా : బీకే

ABN , Publish Date - Feb 04 , 2024 | 12:06 AM

రాబోయే ఎన్నికల్లో తను పెనుకొండ నుంచి ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీచేస్తానని, ఇందులో ఎవరికీ ఎలాంటి అనుమానాలు అవసరం లేదని టీడీపీ జిల్లా అఽధ్యక్షుడు బీకే పార్థసారథి అన్నారు.

పెనుకొండ నుంచి ఎమ్మెల్యేగా పోటీచేస్తా : బీకే
విలేకరులతో మాట్లాడుతున్న బీకే పార్థసారథి

పెనుకొండ, ఫిబ్రవరి 3 : రాబోయే ఎన్నికల్లో తను పెనుకొండ నుంచి ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీచేస్తానని, ఇందులో ఎవరికీ ఎలాంటి అనుమానాలు అవసరం లేదని టీడీపీ జిల్లా అఽధ్యక్షుడు బీకే పార్థసారథి అన్నారు. ఆయన శనివారం పట్టణంలోని టీడీపీ కార్యాలయంలో విలేకరుల సమావేశంలో మా ట్లాడుతూ... పెనుకొండ అసెంబ్లీ టీడీపీ అభ్యర్థి విషయంలో నియోజకవర్గంలోని నాయకులు, కార్యకర్తలకు కొన్ని అనుమానాలు చోటుచేసుకున్నాయన్నారు. తా ను ఎమ్మెల్యేగా కాకుండా ఎంపీగా పోటీచేస్తానని నాయకులు, కార్యకర్తల్లో అపో హలున్నాయన్నారు. ఈ విషయంలో కార్యక ర్తలు, అభిమానులు ఆలోచించాల్సిన అవసరం లేదని, తాను పెనుకొండ ఎమ్మెల్యే అభ్యర్థిగానే పోటీలో ఉంటా నని తెలిపారు. రాష్ట్రంలో ఏ నియోజకవర్గానికి ఇంతవరకు టీడీపీ అభ్యర్థులను ఖ రారు చేయలేదన్నారు. టికెట్‌ ఆశించే అభ్యర్థులకు సంబంధించి వారికి ప్రతిపక్ష అభ్యర్థిని ఎదుర్కొనే సత్తా ఉందా లేదా, ఏ అభ్యర్థికి ఏ స్థానం టికెట్‌ కేటాయి స్తే విజయం సాధిస్తారు, ప్రజాభిమానం ఎవరికి ఉందనే అంశాలను అదిష్టా నం పరిశీలిస్తుందన్నారు. ఇప్పటికే ఆశావహుల బయోడేటాను తీసకున్నారని, సర్వేల ప్రకారం అభ్యర్థులను నియమిస్తారని తెలిపారు. తాను 37ఏళ్లుగా పార్టీ అభివృద్ధి కోసం కష్టపడి పనిచేస్తున్నానని, ప్రజల సమస్యలను పరిష్కరిస్తున్నా మన్నారు. తనకు సంబంధించిన వివరాలు అధిష్టానానికి తెలుసన్నారు. పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ఆశీస్సులతో తాను ఎమ్మెల్యే అభ్యర్థి బరిలో ఉం టానన్నారు. నాయకులు, కార్యకర్తలు తనకు అండగా ఉండి సహకరించాల ని కోరారు. ఈ సమావేశంలో రైతు సంఘం రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి జీవీపీ నాయుడు, యాదవసంఘం నాయకుడు కేశవయ్య, చిన్నప్పయ్య, నరహరి, గుట్టూరు నాగరాజు, లక్ష్మీనారాయణరెడ్డి, వీజీపాళ్యం శ్రీనివాసులు, ఆదిశేషు, కన్వీనర్‌ రవిశంకర్‌, సిద్దయ్య తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Feb 04 , 2024 | 12:06 AM