Share News

సూపర్‌ సిక్స్‌ పథకాలపై విస్తృత ప్రచారం

ABN , Publish Date - Apr 07 , 2024 | 12:21 AM

ఓబుళదేవరచెరువు, ఏప్రిల్‌ 6: మండలకేంద్రంతో పాటు మండలంలోని కొండకమర్ల పంచాయతీలో గల నవాబుకోట, నాయనకోట వీరప్పగారిపల్లి తదితర గ్రామాల్లో శనివారం టీడీపీ నాయకులు సూపర్‌ సిక్స్‌ పథకాలపై విస్తృత ప్రచారం చేశారు.

సూపర్‌ సిక్స్‌ పథకాలపై విస్తృత ప్రచారం

ఓబుళదేవరచెరువు, ఏప్రిల్‌ 6: మండలకేంద్రంతో పాటు మండలంలోని కొండకమర్ల పంచాయతీలో గల నవాబుకోట, నాయనకోట వీరప్పగారిపల్లి తదితర గ్రామాల్లో శనివారం టీడీపీ నాయకులు సూపర్‌ సిక్స్‌ పథకాలపై విస్తృత ప్రచారం చేశారు. ఇంటింటా తిరిగి ప్రజలకు కరపత్రాలు అందజేస్తూ.. చంద్రబాబు ప్రకటించిన సూపర్‌ సిక్స్‌ పథకాల గురించి వివరించారు. ఈ పథకాల వల్ల కలిగే ప్రయోజనాలను తెలియజేశారు. టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి పల్లె సింధూరారెడ్డిని అధిక మోజార్టీతో గెలిపించాలని కోరారు. కార్యక్రమంలో నాయకులు ఆంజనేయులు, జాకీర్‌, సురేష్‌, ఆర్ఫీఖాన, శ్రీనివాసులు, షబ్బీర్‌, మస్తానమ్మ, అబ్లు, తోఫిక్‌ఖాన తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Apr 07 , 2024 | 12:21 AM