జాబ్ క్యాలెండర్ ఎక్కడ..?
ABN , Publish Date - Jan 12 , 2024 | 12:13 AM
ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్‌ను విడుదల చేస్తామని గొప్పలు చెబుతున్నా వైసీపీ ప్రభుత్వం ఎక్కడ విడుదల చేసిందో చూపించాలని టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు ఉన్నం హనుమంతరాయచౌదరి ప్రశ్నించారు.

టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఉన్నం హనుమంతరాయచౌదరి
కళ్యాణదుర్గం, జనవరి 11: ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్‌ను విడుదల చేస్తామని గొప్పలు చెబుతున్నా వైసీపీ ప్రభుత్వం ఎక్కడ విడుదల చేసిందో చూపించాలని టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు ఉన్నం హనుమంతరాయచౌదరి ప్రశ్నించారు. గురువారం శెట్టూరు మండల పరిధిలోని బొచ్చుపల్లిలో బాబు ష్యూరిటీ-భవిష్యత్తుకు గ్యారెంటీ కార్యక్రమాన్ని నిర్వహించారు. టీడీపీ నాయకులు గోళ్ల వెంకటేశులు, గురుప్రసాద్, రామాంజనేయులు పాల్గొన్నారు.
వచ్చేది రైతు రాజ్యమే
- టీడీపీ రాష్ట్ర కార్యదర్శి వెంకటశివుడు యాదవ్
పామిడి: రాష్ట్రంలో రెండు నెలలు తర్వాత వచ్చేది రైతు రాజ్యమేనని టీడీపీ రాష్ట్ర కార్యదర్శి వెంకటశివుడుయాదవ్ అన్నారు. మండలంలోని గజరాంపల్లి, పొగరూరు గ్రామాలలో గురువారం బాబు ష్యూరిటీ-భవిష్యత్తుకు గ్యారెంటీ కార్యక్రమం నిర్వహించారు. ఇంటింటికీ వెళ్లి సూపర్‌సిక్స్ పథకాలుపై అవగాహన కల్పించారు. దేవాలయం, రచ్చకట్ట వద్ద రైతులతో ఆయన మాట్లాడారు. కార్యక్రమంలో గుంతకల్లు మార్కెట్ యార్డు మాజీ చైర్మన బండారు ఆనంద్, టీడీపీ మండల కన్వీనర్ ముసలిరెడ్డి, రామలింగారెడ్డి, పరుశురాంయాదవ్, రామాంజనేయులు యాదవ్, రంగారెడ్డి, లక్ష్మీకాంతరెడ్డి, సాంబశివ, వీరాంజనేయులు, వీరారెడ్డి, చాంద్‌బాషా, ఖాదర్ పాల్గొన్నారు.
వైసీపీతోనే రాష్ట్రంలో ఆర్థిక సంక్షోభం
రాష్ట్రంలో వైసీపీ పాలనలో ఆర్థిక సంక్షోభం నెలకొందని టీడీపీ డాక్టర్స్ సెల్ జిల్లా అధ్యక్షురాలు డాక్టర్ పత్తి హిమబిందు అన్నారు. మండలంలోని పాళ్యం గ్రామంలో గురువారం సాయంత్రం బాబు ష్యూరిటీ-భవిష్యత్తుకు గ్యారెంటీ కార్యక్రమం నిర్వహించారు. మండల నాయకులు ప్రతాప్, అంజి, తిరుపాలు, మునీంద్ర, ఓబులేసు, లక్ష్మీనారాయణ, రామాంజనేయు లు, తిరుపాలు, చాగంటి గోవిందరాజులు, నారాయణ, మనోహర్, వెంకట నరసింహుడు, ఉమానాయక్, మాధవి, గోవిందమ్మ, రాధా పాల్గొన్నారు.