Share News

‘పోలీసు సోదాల వెనుక ఆంతర్యమేమిటో?’

ABN , Publish Date - Mar 08 , 2024 | 12:12 AM

ధర్మవరం, మార్చి 7: విజయవాడలో జనసేన పార్టీ కార్యాలయ సిబ్బంది బసచేసే అపార్ట్‌మెంట్‌పై పోలీసులు ఎటువంటి కారణాలు చెప్పకుండా సోదాలు చేయడంలో ఆంతర్యమేమిటని ఆ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చిలకం మధుసూదనరెడ్డి మండిపడ్డారు.

‘పోలీసు సోదాల వెనుక ఆంతర్యమేమిటో?’

ధర్మవరం, మార్చి 7: విజయవాడలో జనసేన పార్టీ కార్యాలయ సిబ్బంది బసచేసే అపార్ట్‌మెంట్‌పై పోలీసులు ఎటువంటి కారణాలు చెప్పకుండా సోదాలు చేయడంలో ఆంతర్యమేమిటని ఆ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చిలకం మధుసూదనరెడ్డి మండిపడ్డారు. పట్టణంలోని తన నివాసంలో గురువారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. జనసేన పార్టీ కార్యాలయ సిబ్బందికి చెందిన అపార్ట్‌మెంట్‌పై బుధవారం రాత్రి పోలీసులు ఎవరి అనుమతిలేకుండా సోదాలు చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నానన్నారు. జనసేన, టీడీపీ పొత్తు ఖరారైనప్పటి నుంచి సీఎం జగనకి ఓటమి భయం పట్టుకుందన్నారు. దిక్కుతోచని స్థితిలో ఈ విధమైన దుశ్చర్యలకు పాల్పడుతున్నారని దుయ్యబట్టారు. త్వరలోనే ప్రజలు జగనకు తగిన గుణపాఠం చెబుతారని ఆయన పేర్కొన్నారు.

Updated Date - Mar 08 , 2024 | 12:12 AM