ఏమప్పా.. ఎంతిచ్చినారు..?
ABN , Publish Date - May 12 , 2024 | 12:04 AM
ఏమప్పా సోమవారమే ఓటు వేసేది.. యా పార్టీవాళ్లు ఎంతిచ్చారప్పా.. వాళ్లేమో రూ. 1500 ఇచ్చారు. మరొకరు ఇంకా రాలేదంటున్నారు..

బొమ్మనహాళ్, మే 11: ఏమప్పా సోమవారమే ఓటు వేసేది.. యా పార్టీవాళ్లు ఎంతిచ్చారప్పా.. వాళ్లేమో రూ. 1500 ఇచ్చారు. మరొకరు ఇంకా రాలేదంటున్నారు.. సార్వత్రిక ఎన్నికల పోలింగ్ సమీపిస్తున్న వేళ నలుగురు ఎక్కడ కలిసినా ఇవే చర్చలు. సామాజిక, ఆర్థిక, రాజకీయాల విషయాల గురించి సంభాషణలే. హోటళ్లు, బార్బర్‌షాప్‌లు, గ్రామీణ ప్రాంతాల్లో రచ్చకట్ట దగ్గర ఏ నలుగురు కూర్చున్నా రాజకీయంపైనే చర్చ జరుగుతోంది. ఉదయం, సాయంత్రం స్థానిక రాజకీయ నాయకులతో పాటు రాష్ట్ర, జాతీయ రాజకీయ అంశాలు కూడా చర్చించుకుంటున్నారు. అక్కడక్కడా వాదోపవాదాలు, సవాళ్లు కూడా కనిపిస్తున్నాయి.