Share News

ఐదేళ్లలో ఏం అభివృద్ధి చేశావ్‌..!

ABN , Publish Date - Jun 07 , 2024 | 11:57 PM

మా ప్రభుత్వం ఏర్పడక ముందే... ఆరు నెలల్లో ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చాలని డిమాండ్‌ చేస్తున్నావ్‌... గత ఎన్నికల ముందు నీవు ఇచ్చిన హామీలను అధికారంలో ఉన్న ఐదేళ్లలో చేశావా.. అరాచకాలు.. దోపి డీలు.. దౌర్జన్యాలతో నియోజకవర్గాన్ని సర్వనాశనం చేశావ్‌.. అభివృద్ధి గురించి మాట్లాడే అర్హత కూడా నీకు లేదు..’ అని మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డిపై టీడీపీ కన్వీనర్లు ధ్వజమెత్తారు.

 ఐదేళ్లలో ఏం అభివృద్ధి చేశావ్‌..!
మీడియాతో మాట్లాడుతున్న టీడీపీ కన్వీనర్లు

రాప్తాడు, జూన 7: ‘ మా ప్రభుత్వం ఏర్పడక ముందే... ఆరు నెలల్లో ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చాలని డిమాండ్‌ చేస్తున్నావ్‌... గత ఎన్నికల ముందు నీవు ఇచ్చిన హామీలను అధికారంలో ఉన్న ఐదేళ్లలో చేశావా.. అరాచకాలు.. దోపి డీలు.. దౌర్జన్యాలతో నియోజకవర్గాన్ని సర్వనాశనం చేశావ్‌.. అభివృద్ధి గురించి మాట్లాడే అర్హత కూడా నీకు లేదు..’ అని మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డిపై టీడీపీ కన్వీనర్లు ధ్వజమెత్తారు. నగరంలోని పరిటాల క్యాంపు కార్యాల యంలో ఆరు మండలాల కన్వీనర్లు పంపు కొండప్ప, జింకా సూర్యనారాయణ, శ్రీనివాసులు, పోతులయ్య, సుధాకర్‌, ముత్యాలరెడ్డి శుక్రవారం మీడియాతో మాట్లాడారు. ప్రకాష్‌రెడ్డి చేసిన వాఖ్యలపై విరుచుకుపడ్డారు.


‘ గ్రామాల్లో ప్రజలకు తాగునీటి కోసం ఏర్పాటు చేసిన వాటర్‌ప్లాంట్లను మూసివేయించావ్‌.. ఇదేనా నీవు చేసిన అభివృద్ధి.. గ్రామాల్లో వందలాది మంది టీడీపీ కార్యకర్తలపై దాడులు చేయించావు. వాటిని మర్చిపోయావా. ఆ రోజుల్లో పోలీసులకు ఫిర్యాదు చేసినా... కోర్టులకు వెళ్లినా మీరు దాడులు చేశారు. ఇవాళ అక్కడక్కడా జరుగుతున్న సంఘటనలను పరిటాల కుటుంబానికి ఆపాదించడం న్యాయమేనా.? ఎన్నికల ముందు నుంచి నేటి వరకూ ఎవరూ ఎక్కడా సంయమనం కోల్పోవద్దని ఎవరైనా రెచ్చగొట్టినా శాంతి యుతంగా ఉండాలని పరిటాల సునీత చెబుతూనే ఉన్నారు. ఇలాంటి మాట మీరు ఐదేళ్లలో ఏనాడైనా.. ఎక్కడైనా అన్నారా..? ఏ రోజైనా నువ్వు కనీసం మీ కార్యకర్తలనైనా పట్టించుకున్నారా. కనీసం నీ సొంత గ్రామానికి కూడా రోడ్డు వేయించుకోలేని దద్దమ్మవు నీవు... నువ్వా అభివృద్ధి గురించి మాట్లాడేది..? మీ ఎమ్మెల్యేలంతా రాష్టాన్ని కుక్కలు చింపిన విస్తరలా చేశారు. ఇక నుంచి మీ సోదరులు గతంలోలాగా ఇష్టానుసారం మాట్లాడితే ఊరుకునేది లేదు. జాగ్రత్తగా ఉండు.’ అని హెచ్చరించారు.

Updated Date - Jun 07 , 2024 | 11:57 PM