Share News

జాబ్‌ క్యాలెండర్‌ హామీ ఏమైంది జగన?

ABN , Publish Date - Jan 05 , 2024 | 12:14 AM

ఏటా జనవరిలో జ్యాబ్‌ క్యాలెండర్‌ విడుదల చేస్తామని ఇచ్చిన హామీని సీఎం జగన గాలికి వదిలేశాడని టీఎనఎ్‌సఎ్‌ఫ, తెలుగు యువత నాయకులు విమర్శించారు.

జాబ్‌ క్యాలెండర్‌ హామీ ఏమైంది జగన?
మోకాళ్లపై నిల్చుని నిరసన తెలుపుతున్న టీఎనఎ్‌సఎ్‌ఫ, తెలుగు యువత నాయకులు

ఉరవకొండ, జనవరి 4: ఏటా జనవరిలో జ్యాబ్‌ క్యాలెండర్‌ విడుదల చేస్తామని ఇచ్చిన హామీని సీఎం జగన గాలికి వదిలేశాడని టీఎనఎ్‌సఎ్‌ఫ, తెలుగు యువత నాయకులు విమర్శించారు. పట్టణంలో గురువారం ఆ సంఘాల ఆధ్వర్యంలో ఉద్యోగాలను భర్తీ చేయాలంటూ ఆందోళన చేపట్టారు. స్థానిక టీడీపీ పార్టీ కార్యాలయం నుంచి టవర్‌క్లాక్‌ వరకు ర్యాలీ నిర్వహించారు. అంబేడ్కర్‌ విగ్రహం వద్ద అర్ధనగ్న ప్రదర్శన చేపట్టి నిరసన తెలిపారు. భిక్షాటన చేశారు. అనంతపురం- గుంతకల్లు రహదారిపై మోకాళ్లపై నిల్చుని నిరసన వ్య క్తం చేశారు. జాబ్‌ కావాలి అంటే బాబు రావాలి, సైకో జగన పోవాలంటూ నినాదాలు చేశారు. టీఎనఎ్‌సఎ్‌ఫ నాయకులు ప్యారంభరత, కుమార్‌స్వామి, సుధాకర్‌, ప్రశాంత, మనోజ్‌కుమార్‌, తెలుగు యువత నాయకులు మణిచౌదరి, వన్నూరుస్వామి, పెద్దన్న, పల్లా హరి, విజయ్‌, చంద్ర, బెస్త హరి, నూర్‌, భీమేష్‌ పాల్గొన్నారు.

Updated Date - Jan 05 , 2024 | 12:14 AM