JC భూసమస్యలపై ప్రతివారం సమావేశం: జేసీ
ABN , Publish Date - Jun 27 , 2024 | 12:30 AM
జిల్లాలో భూసమస్యలను పరిష్కరించడానికి ప్రతివారం సమావేశం నిర్వహిస్తామని, అందుకు తగు చర్యలు తీసుకోవాలని జాయింట్ కలెక్టర్ అభిషేక్‌కుమార్ అధికారులను ఆదేశించారు.

పుట్టపర్తి, జూన 26: జిల్లాలో భూసమస్యలను పరిష్కరించడానికి ప్రతివారం సమావేశం నిర్వహిస్తామని, అందుకు తగు చర్యలు తీసుకోవాలని జాయింట్ కలెక్టర్ అభిషేక్‌కుమార్ అధికారులను ఆదేశించారు.
జిల్లాకేంద్రంలోని కలెక్టరేట్‌లో బుధవారం ఆయన అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించి మాట్లాడారు. ఏయే మండలాల్లో భూసమస్యలు అధికంగా ఉన్నాయో ఆయా తహసీల్దార్లు నివేదికలు సిద్ధం చేయాలన్నారు. వివిద కోర్టుల్లో ఉన్న కేసులను గుర్తించడంతో పాటు వాటిపై కౌంటర్ కేసులు వేశారా.. లేదా అన్న విషయాన్ని గుర్తించాలన్నారు. అలాగే జిల్లాలో జాతీయ రహదారులకు భూములు కోల్పోయిన ప్రతిరైతును గుర్తించాలని, నష్టపరిహారం అందజేయడానికి ప్రణాళికలు సిద్ధం చేయాలని ఆదేశించారు. తర్వాత రైల్వేపనులపై భూసేకరణ, ఏపీఐఐసీ అభివృద్ధి పనులపై సమీక్ష చేశారు. కార్యక్రమంలో పెనుకొండ సబ్ కలెక్టరు అపూర్వభరత, ఎనహెచ అధికారి గిడ్డయ్య, ఆర్డీఓలు వెంకటశివారెడ్డి, భాగ్యరేఖ, ఏపీఐఐసీ జిల్లా అధికారి షహీనాసోనీ, పులువురు తహసీల్దార్లు, పాల్గొన్నారు.
మరిన్ని అనంతపురం వార్తల కోసం..